IND Vs PAK: షమీ చెత్త రికార్డ్.. తొలి ఓవర్ లోనే 11 బంతులు

IND Vs PAK: షమీ చెత్త రికార్డ్.. తొలి ఓవర్ లోనే 11 బంతులు

దుబాయ్ వేదికగా పాకిస్థాన్ తో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫి పోరులో భారత్ కు తొలి ఓవర్ కలిసి రాలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ కు తొలి ఓవర్ లోనే 6 పరుగులు వచ్చాయి. ఇందులో ఏకంగా 5 వైడ్ల రూపంలో వచ్చినవే. 

తొలి ఓవర్ లో బంతిని స్వింగ్ చేసే ప్రయత్నంలో మహమ్మద్ షమీ ఎక్కువగా వైడ్స్ వేశాడు. దాంతో, తొలి ఓవర్ లోనే 5 పరుగులు ఎక్స్ట్రాల రూపంలో రావడంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. మొత్తంగా షమీ ఓవర్ పూర్తి చేయడానికి 11 బంతులు వేయవలసి వచ్చింది. ఈ క్రమంలో భారత పేసర్ ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో తొలి ఓవర్‌ పూర్తి చేయడానికి అత్యధిక బంతులు విసిరిన బౌలర్‌ అయ్యాడు. తొలి ఓవర్‌ పూర్తి చేయడానికి 11 బంతులు  తీసుకున్నాడు. అంతకుముందు ఇర్ఫాన్‌ పఠాన్‌, జహీర్‌ ఖాన్‌ కూడా 11 బంతులు తీసుకున్నారు.

Also Read : పాకిస్థాన్‌తో హై వోల్టేజ్ మ్యాచ్

అంతకుముందు ఈ మ్యాచ్ లో భారత్ టాస్ ఓడిపోయింది. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ భారత్ ముందు భారీ టార్గెట్ చేస్తామని చెప్పుకొచ్చాడు. ఓపెనర్లుగా ఇమామ్ ఉల్ హక్ తో పాటు బాబర్ అజామ్ బ్యాటింగ్ కు వచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు యువ ఓపెనర్ సైమ్ అయూబ్ గాయపడగా.. టోర్నీ తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ పై ఫీల్డింగ్ చేస్తూ ఫకర్ జమాన్ గాయపడ్డాడు. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే సెమీస్ కు చేరుకుంటుంది. మరోవైపు పాక్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.