భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ సోదరుడు మహ్మద్ కైఫ్ రంజీల్లో అరంగేట్రం చేశాడు. బెంగాల్ తరపున ఆడుతున్న కైఫ్.. రంజీట్రోఫీ-2024లో భాగంగా శుక్రవారం(జనవరి 6) ఆంధ్ర జట్టుతో జరిగిన మ్యాచ్‌తో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. తొలి రోజు 12 ఓవర్లు బౌలింగ్ చేసిన కైఫ్.. 15 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో తన తమ్ముడికి అభినందనలు తెలుపుతూ షమీ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ చేశారు.
"ఎట్టకేలకు సుదీర్ఘ పోరాటం అనంతరం నీవు అనుకున్నది సాధించావ్.. బెంగాల్ తరపున రంజీల్లో అరంగ్రేటం చేయటం గొప్ప విషయం. ఈ విజయం సాధించినందుకు నీకు అభినందనలు. చీర్స్..!! నీ కెరీర్‌లో మరింత ఎత్తుకు ఎదిగాలని కోరుకుంటున్నా.. జట్టు కోసం ప్రతి మ్యాచ్‌లోనూ 100 శాతం కష్టపడు.. మంచి ప్రదర్శన ఇవ్వు.." అని షమీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Finally after a long struggle, you got Ranji trophy cap ? for Bengal . Cheers!! Great Achievement !! Congratulations, I wish you a great future ahead! Give your 100% and Keep continuing hard work & do well
— ???????? ????? (@MdShami11) January 5, 2024
#shami #mdshami #mdshami11 #mdkaif #bengal pic.twitter.com/2FN8g2090l
రైట్ ఆర్మ్ పేసర్
కైఫ్ కూడా షమీ మాదిరి రైట్ ఆర్మ్ పేసర్. ఇప్పటివరకూ 9 లిస్ట్- ఎ మ్యాచ్‌లు ఆడిన కైఫ్.. 26.33 సగటుతో 12 వికెట్లు పడగొట్టాడు. అయితే, ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ వేలంలో కైఫ్‌కు నిరాశ ఎదురైంది. అతన్ని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. దీంతో అన్ సోల్డ్ ఆటగాడిగా మిగిలిపోయాడు.