IND vs NZ Final: ఇంకెన్ని వదిలేస్తావ్ షమీ.. చేతుల్లోకి వచ్చిన క్యాచ్ మిస్

IND vs NZ Final: ఇంకెన్ని వదిలేస్తావ్ షమీ.. చేతుల్లోకి వచ్చిన క్యాచ్ మిస్

ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్ కు ఓపెనర్లు విల్ యంగ్, రచీన్ రవీంద్ర ఇండియా బౌలర్లపై ఆధిపత్యం చూపిస్తున్నారు. ముఖ్యంగా రచీన్ రవీంద్ర బౌండరీలతో హోరెత్తించాడు. ప్రమాదకరంగా మారుతున్న రచీన్ ను ఔట్ చేసే అవకాశం వచ్చింది. అయితే షమీ క్యాచ్ పెట్టకపోవడంతో నిరాశే మిగిలింది. షమీ వేసిన ఇన్నింగ్స్ 7 ఓవర్ మూడో బంతిని రచీన్ రవీంద్ర స్ట్రయిట్ గా ఆడాడు.

ALSO READ | IND vs NZ Final: హెన్రీ స్థానంలో నాథన్ స్మిత్.. ఎవరీ కివీస్ అల్ రౌండర్
            
బౌలింగ్ చేస్తున్న షమీ చేతుల్లోకి నేరుగా క్యాచ్ రాగా..  ఈజీ క్యాచ్ జారవిడిచాడు. దీంతో కివీస్ ఓపెనర్ బంతికిపోయాడు. రచీన్ రవీంద్ర వచ్చిన అవకాశాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటాడో చూడాలి. సెమీ ఫైనల్లో కూడా షమీ రిటర్న్ క్యాచ్ లను అందుకోవడంలో విఫలమయ్యాడు. ట్రావిస్ హెడ్, స్మిత్ ఇచ్చిన క్యాచ్ లను అందుకోలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ప్రస్తుతం న్యూజిలాండ్ తొలి 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది. క్రీజ్ లో విలియంసన్ (9), రచీన్ రవీంద్ర (37) ఉన్నారు. 15 పరుగులు చేసిన యంగ్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ఔటయ్యాడు.