IND vs BAN: బంగ్లాను వణికించాడు: స్టార్క్‌ను వెనక్కి నెట్టి షమీ ఆల్ టైం రికార్డ్

IND vs BAN: బంగ్లాను వణికించాడు: స్టార్క్‌ను వెనక్కి నెట్టి షమీ ఆల్ టైం రికార్డ్

బంగ్లాదేశ్ తో దుబాయ్ వేదికగా గురువారం (ఫిబ్రవరి 20) జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ అదరగొట్టాడు. ఐదు వికెట్లు పడగొట్టి బంగ్లాను వణికించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో షమీ వన్డేల్లో తన 200 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. జేకర్ అలీ వికెట్ తో షమీ ఈ ఘనత అందుకున్నాడు. దీంతో స్టార్క్ తర్వాత వన్డేల్లో ఫాస్టెస్ట్ 200 వికెట్లు తీసుకున్న రెండో బౌలర్ గా నిలిచాడు.  వన్డేల్లో వేగంగా 200 వికెట్లు తీసుకున్న రికార్డ్ స్టార్క్ పేరిట ఉంది.

ALSO READ | Champions Trophy 2025: ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్.. ప్లేయింగ్ 11 ప్రకటించిన ఇంగ్లాండ్

102 ఇన్నింగ్స్ ల్లో స్టార్క్ ఈ ఘనతను అందుకున్నాడు. మరోవైపు షమీ 104 ఇన్నింగ్స్ ల్లో 200 వికెట్లు పడగొట్టి పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ సక్లైన్ ముస్తాఖ్ సరసన చేరాడు. బంతుల పరంగా వేగంగా 200 వికెట్లు పడగొట్టిన రికార్డ్ మాత్రం షమీ దక్కించుకున్నాడు. 200 వికెట్లు తీసుకోవడానికి షమీకి 5126 బంతులు అవసరం కాగా.. స్టార్క్ 5240 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. సక్లైన్ ముస్తాఖ్, బ్రెట్ లీ, బోల్ట్ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. 

ఐసీసీ టోర్నమెంట్స్ లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గాను షమీ మరో రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు.  ఇప్పటివరకు షమీ ఐసీసీ టోర్నీల్లో 60 వికెట్లు పడగొట్టాడు. దీంతో టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ (59) ను వెనక్కి నెట్టాడు. 2023 వన్డే వరల్డ్ ఫైనల్లో చివరి ఐసీసీ టోర్నీ ఆడిన షమీ.. 14 నెలల తర్వాత రీ ఎంట్రీ లో అదరగొట్టాడు. తనకు  బాగా కలిసొచ్చిన ఐసీసీ టోర్నీలో వికెట్ల వర్షం కురిపించాడు. 34 ఏళ్ళ  షమీ ఓవరాల్ గా టెస్ట్ క్రికెట్ లో 229.. వన్డేల్లో 202.. టీ20ల్లో 27 వికెట్లు పడగొట్టాడు.