Mohammed Shami: సానియా మీర్జాతో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన షమీ

Mohammed Shami: సానియా మీర్జాతో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన షమీ

భారత క్రీడారంగంలో క్రికెట్ ప్లేయర్ మహమ్మద్ షమీ, టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా వారి రంగాల్లో తమదైన ముద్ర వేశారు. భారత క్రికెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫాస్ట్ బౌలర్ గా షమీ పేరు తెచ్చుకుంటే.. టెన్నిస్ లో సానియా దేశానికి ఎంతో కీర్తిని తీసుకొచ్చింది. వీరి ప్రొఫెషనల్ లైఫ్ బాగున్నా.. వ్యక్తిగత జీవితం మాత్రం సరిగా లేదనే చెప్పాలి. ఇద్దరూ కూడా తమ భాగస్వామ్యుల విషయంలో గొడవలు వచ్చి విడాకులు తీసుకున్నారు. దీంతో గత కొన్ని నెలలుగా సానియా, షమీ వివాహం చేసుకోబోతున్నారనే ప్రచారం తీవ్రంగా జరిగింది. 

షమీ, మీర్జా వివాహ దుస్తులలో ఉన్నట్లు డాక్టరేట్ చేసిన చిత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. వీరిద్దరి వివాహంపై ఇప్పటికీ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ విషయంపై తాజాగా మహమ్మద్ షమీ స్పందించాడు. శుభంకర్ మిశ్రాతో ఇటీవల యూట్యూబ్‌లో చేసిన చాట్‌లో ఈ విషయంపై మాట్లాడారు. సానియా మీర్జాకు తనకు వివాహం అంటూ వస్తున్న నిజం లేదన్నారు. సోషల్ మీడియాలో పుకార్లు పుట్టించే వారిపై విరుచుకుపడ్డాడు. సోషల్ మీడియా పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని.. ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రచారం చేయడం మానుకోవాలని షమీ కోరారు.

 పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ షోయ‌బ్ మాలిక్, సానియా మీర్జా 2024 జనవరిలో విడిపోయారు. దీంతో 13 ఏళ్ల వీరి దాంపత్య జీవితానికి తెర పడింది. షరియా చట్టాల ప్రకారం సానియాకు విడాకులిచ్చిన మాలిక్.. పాకిస్తానీ నటి సనా జావేద్‌‌ను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం సానియా ఇటీవలే పవిత్రమైన హజ్ యాత్రను ప్రారంభించింది. మాలికి నుంచి విడిపోయిన తర్వాత  టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈమె.. తాజాగా ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ లో పండిట్ గా పని చేసింది. 

ALSO READ : వారిద్దరి వల్లే పాకిస్థాన్ పై విజయం: హర్మన్‌ప్రీత్ కౌర్

మరోవైపు భార్యతో విడిపోయిన షమీ వరల్డ్ కప్ లో అదరగొట్టి ఈ టోర్నీలో టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. వరల్డ్ కప్ లో గాయపడిన షమీ ఆ తర్వాత భారత జట్టులో కనిపించలేదు. 2024 ఫిబ్రవరి నెలలో ఎడమ చీలమండకు సర్జరీ చేయించుకున్నాడు. లండన్‌‌‌‌లోని ఓ హాస్పిటల్‌‌‌‌లో ఈ సర్జరీ నిర్వహించారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ కు షమీ దూరమయ్యాడు. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న ఈ టీమిండియా పేసర్ ఆగస్టు నెలలో భారత జట్టులో చేరే అవకాశం ఉంది.