Mohammed Shami: భారత జట్టులోకి ఎప్పుడు వస్తానో చెప్పలేను.. ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన షమీ

టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ తన గాయం గురించి కీలక సమాచారం అందించాడు. కోల్‌కతాలోని ఈస్ట్ బెంగాల్ క్లబ్ షమీని  సత్కరించిన తర్వాత షమీ తన పునరాగమనం గురించి హింట్ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎప్పుడు వస్తానో ఖచ్చితంగా చెప్పలేనని షాక్ ఇచ్చాడు. గాయం తనను ఇంత ఇబ్బందికి గురి చేస్తుందని అనుకోలేదని.. ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ ఆడలేకపోయినదుకు బాధగా ఉందని అన్నారు.

టీమిండియాలోకి రావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాని తెలిపారు. భారత జట్టులోకి వచ్చే ముందు నేను బెంగాల్ తరపున రెండు, మూడు మ్యాచ్ లు ఆడతానని.. పూర్తి ఫిట్ నెస్ సాధించిన తర్వాత టీమిండియాలోకి చెప్పుకొచ్చారు. గాయం తీవ్రంగా ఉంటుందని.. నయం కావడానికి చాలా సమయం పడుతుందని వైద్యులు కూడా గ్రహించలేకపోయారని షమీ ఈ సందర్భంగా అన్నారు. భారత్ తరపున షమీ చివరిసారిగా 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడాడు. 

ALSO READ | 2007 T20 WC Final: హర్యానా పోలీస్ ఆఫీసర్‌తో ధోనీ

చీలమండ గాయంతో సర్జరీ చేయించుకున్న ఈ స్పీడ్ స్టార్ ఇటీవలే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో నెట్స్‌లో బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. తాజాగా భారత క్రికెట్ లో ఎంట్రీ ఇవ్వడానికి తాను సిద్ధం అని ఈ స్పీడ్ స్టార్ సోషల్ మీడియాలో తెలిపాడు. గతేడాది వరల్డ్ కప్ లో షమీ 24 వికెట్లు తీసి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. 2023లో తన సంచలన ప్రదర్శనకు గాను షమీ ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డును అందుకున్నాడు. 33 ఏళ్ళ ఈ సీనియర్ పేసర్ స్వదేశంలో బంగ్లాదేశ్ పై జరగబోయే టెస్టు సిరీస్ సమయానికల్లా కోలుకుంటాడని బీసీసీఐ సెక్రటరి జైషా తెలిపాడు.