టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ తన రీ ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. ఏడాది తర్వాత పోటీ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ఈ భారత పేసర్ తొలి మ్యాచ్ లోనే అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. రంజీ ట్రోఫీలో సూపర్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. గురువారం (నవంబర్ 14) ఇండోర్‌లో బెంగాల్ తరపున ఆడుతున్న షమీ.. మధ్యప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. షమీ బౌలింగ్ ధాటికి ప్రత్యర్థి జట్టు వద్ద సమాధానం లేకుండా పోయింది.
ALSO READ | ఏటీపీ ఫైనల్స్ 2024.. మళ్లీ ఓడిన బోపన్న జోడీ
ఈ మ్యాచ్ లో ఓవరాల్ గా 19 ఓవర్లలో 2.80 ఎకానమీ రేట్ తో 54 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. మధ్యప్రదేశ్ కెప్టెన్ శుభమ్ శర్మ వికెట్ తో పాటు శరాన్ష్ జైన్, కుమార్ కార్తికేయ వంటి కీలక వికెట్లు పడగొట్టాడు. ఫిట్ నెస్ లేని కారణంగా ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఎంపికైన 18 మంది స్క్వాడ్ లో షమీ చోటు దక్కించుకోలేకపోయాడు. రంజీ ట్రోఫీలో సత్తా చాటి త్వరలోనే టీమిండియాలో ఎంట్రీ ఇవ్వాలని షమీ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ లోనే సత్తా చాటి టీమిండియా తలుపులు తట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు.
స్వదేశంలో జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత షమీ భారత జట్టుకు దూరమయ్యాడు. చీలమండ గాయంతో సర్జరీ చేయించుకున్న ఈ స్పీడ్ స్టార్ ఆ తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో నెట్స్‌లో బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కు అందుబాటులో ఉంటాడని భావించిన అది సాధ్యపడలేదు.
ఆ తర్వాత న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ తో పాటు.. ఆస్ట్రేలియాలో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి దూరమయ్యాడు. షమీ బౌలింగ్ తో మధ్య ప్రదేశ్ తమ తొలి ఇన్నింగ్స్ లో 167 పరుగులకే ఆలౌటయ్యారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది.
Mohammed Shami is back & how 🔥 pic.twitter.com/4uDRBS56Zr
— Cricket Addictor (@AddictorCricket) November 14, 2024