కోహ్లీ వరల్డ్ బెస్ట్ బ్యాటర్.. డేంజరస్ మాత్రం అతనే: మహమ్మద్ షమీ

కోహ్లీ వరల్డ్ బెస్ట్ బ్యాటర్.. డేంజరస్ మాత్రం అతనే: మహమ్మద్ షమీ

టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నాడు. తాజాగా న్యూస్ 18 ఇండియా ఈవెంట్ 'చౌపా'లో జరిగిన ఇంటరాక్షన్ లో షమీకి వరల్డ్ బెస్ట్ బ్యాటర్ అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు బదులుగా షమీ ఒక్క క్షణం ఆలోచించకుండా విరాట్ కోహ్లీ పేరు చెప్పేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ప్రపంచంలోని ప్రమాదకర బ్యాటర్ గా ఎంచుకున్నాడు. 

విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్. విరాట్ చాలా రికార్డులు బద్దలు కొట్టాడు. విరాట్ బెస్ట్ అని నేను భావిస్తున్నాను. అలాగే రోహిత్ శర్మ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ అని షమీ అన్నాడు. కోహ్లీ ఇటీవలే భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో 765 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మరోవైపు రోహిత్ 597 పరుగులు చేసి ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. బెస్ట్ కెప్టెన్ గురించి మాట్లాడుతూ.. ఇది చాలా కఠినమైన ప్రశ్న. నాకు మాత్రం MS ధోనీ అని అని ఈ రైట్ ఆర్మ్ పేసర్ తెలియజేశాడు.

వరల్డ్ కప్ ముగిసిన తర్వాత షమీ చీలమండ చికిత్స కోసం UKలో ఉన్నాడు. ఫిట్ గా లేకపోవడంతో ఇంగ్లాండ్ తో జరగబోయే చివరి మూడు టెస్టులకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టుల కోసం భారత జట్టును ఫిబ్రవరి 8, గురువారం ప్రకటించే అవకాశం ఉంది. చివరిసారిగా 2023 వన్డే వరల్డ్ కప్ ఆడగా..ఏడు మ్యాచ్‌లలో 10.71 సగటుతో 24 వికెట్లు తీసుకున్నాడు. వీటిలో మూడు సార్లు ఐదు వికెట్లు ఘనత అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టుల కోసం భారత జట్టును ఫిబ్రవరి 8న గురువారం ప్రకటించే అవకాశం ఉంది.