ఐపీఎల్–17 మొదలుకాకముందే టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఐపీఎల్ కు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో గుజరాత్ టైటాన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నవంబర్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాతో చివరి వన్డే ఆడిన షమీ అప్పట్నించి ఆటకు దూరంగా ఉన్నాడు. అయితే తాజా సమాచార ప్రకారం షమీ టీ20 వరల్డ్ కప్ కు దూరం కానున్నట్లు తెలుస్తుంది.
ఎడమ చీలమండ గాయంతో స్టార్ పేసర్ మహ్మద్ షమీ పునరాగమనం మరింత ఆలస్యం కానుంది. జనవరి చివరి వారంలో షమీ లండన్ వెళ్లి చీలమండకు ప్రత్యేకమైన ఇంజెక్షన్ తీసుకున్నాడు. మూడు వారాల తర్వాత లైట్‌గా రన్నింగ్ మొదలుపెట్టాడు. కానీ ఇంజెక్షన్ పని చేయలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో లండన్‌లో చీలమండ శస్త్రచికిత్స చేయించుకున్న భారత స్పీడ్‌స్టర్.. కోలుకోవడానికి ఎక్కువ సమయం అవసరమని వైద్యులు సూచించారు.
Also Read :అక్కడ కోహ్లీ ఆధిపత్యం లేదు.. అతన్ని ఎదర్కోవడం కష్టమే: హర్భజన్ సింగ్
తాజాగా షమీ పునరాగమనంపై బీసీసీఐ సెక్రటరీ జైషా కీలక సమాచారం అందించారు. ధర్మశాలలో మీడియాతో మాట్లాడిన షా.. సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే హోమ్ సిరీస్‌కు షమీ అందుబాటులో వచ్చే అవకాశముందని తెలియజేశారు. టీ20 వరల్డ్ కప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. దీంతో షమీ టీ20 వరల్డ్ కప్ దూరం అయినట్లే. షమీ దూరం కానుండడంతో భారత్ కు గట్టి ఎదురు దెబ్బ తగలనుంది. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో షమీ అదరగొట్టాడు. మొదటి నాలుగు మ్యాచ్ లకు అతనికి అవకాశం దక్కకపోగా అడిన 7 మ్యాచ్ లలో 24 వికెట్లు పడగొట్టి లీగ్‌లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
Jay Shah said "Mohammed Shami is likely to return for the Bangladesh series". [PTI] pic.twitter.com/yTVDpr5p3g
— Johns. (@CricCrazyJohns) March 11, 2024