భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ వచ్చే నెలలో జరగబోయే ఆస్టేలియా టూర్ కు దూరమయ్యాడు. పూర్తి ఫిట్ నెస్ సాధించని కారణంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ప్రకటించిన 18 మంది సభ్యుల జట్టులో చోటు దక్కలేదు. అయితే షమీ మాత్రం ఆశ కోల్పోకుండా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. రంజీ సీజన్ 2024-25లో బెంగాల్ జట్టు తరఫున రెండు లేదా మూడు మ్యాచ్‌లు ఆడి భారత జట్టులో పునరాగమనం చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా అంతలోనే భారత క్రికెట్ ఫ్యాన్స్ కు.. బీసీసీఐ క్షమాపణలు తెలిపాడు.
'జట్టులోకి రావడానికి నా ప్రయత్నాలను కొనసాగిస్తున్నాను. నా బౌలింగ్ రోజురోజుకు మెరుగుపడుతుంది. త్వరలో భారత టెస్ట్ జట్టులో చేరడానికి తీవ్రంగా కష్టపడుతున్నాను. క్రికెట్ అభిమానులందరికి,బీసీసీఐకి నా క్షమాపణలు. భారత టెస్ట్ జట్టులోకి త్వరలో రావడానికి సిద్ధంగా ఉన్నాను". అని షమీ చెప్పుకొచ్చాడు. షమీ మాటలను చూస్తుంటే అతను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయానికి కోలుకునే అవకాశం కనిపించడం లేదు. ఫిట్ నెస్ సాధిస్తే ఆస్ట్రేలియాతో చివరి మూడు టెస్టుల్లో ఈ స్టార్ ఫాస్ట్ బౌలర్ ఎంపిక కావొచ్చు.
ALSO READ | IND vs NZ 2nd Test: ఐపీఎల్ అంత సింపుల్ కాదు: భారత జట్టును నడిపించలేకపోతున్న గంభీర్
వచ్చే నెలలో భారత జట్టు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో షమీ కీలకం కానున్నాడు. ఈ క్రమంలో అక్కడ గాడిలో పడాలంటే, ముందుగా తగినంత ప్రాక్టీస్ అవసరం కనుక రంజీ ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నాడు. నవంబర్ 6 నుంచి కర్ణాటకతో జరిగే మ్యాచ్‌కి ముందు షమీ బెంగాల్ జట్టులో చేరే అవకాశం ఉంది. ఈ స్పీడ్‌స్టర్ మధ్యప్రదేశ్‌తో ఇండోర్ వేదికగా జరగనున్న తదుపరి మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం ఉంది.
టెస్ట్ ఛాంపియన్ షిప్ కు కీలకమైన ఈ ట్రోఫీకి అనుభవజ్ఞుడు షమీ దూరమైతే భారమంతా సిరాజ్, బుమ్రాపై పడనుంది. భారత్ కు నాణ్యమైన మూడో పేసర్ లేడు. గతేడాది వరల్డ్ కప్ లో షమీ 24 వికెట్లు తీసి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత మడమ గాయానికి గురయ్యాడు. ఫిబ్రవరి నెలలో ఎడమ చీలమండకు సర్జరీ చేయించుకున్నాడు. లండన్‌లోని ఓ హాస్పిటల్‌లో ఈ సర్జరీ నిర్వహించారు.
Mohammad Shami vowed a quick return to cricket 🙌 Wishing him a swifty recovery
— cricketmoodofficial (@cricketmoodcom) October 27, 2024
.
.
.
Cricket, Cricket Updates, Mohammad Shami, Shami, BGT 2024, Cricketmoodofficial pic.twitter.com/qW3VmbD4Aj