భారత్, న్యూజిలాండ్ మధ్య వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది. 398 పరుగులు టార్గెట్ తో గ్రౌండ్ లోకి దిగిన న్యూజిలాండ్ జట్టును.. స్టార్టింగ్ లోనే కట్టడి చేశాడు మన బౌలర్ షమీ. మూడు ఓవర్లు వేసి కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి.. రెండు వికెట్లు తీశాడు.
ఐదో ఓవర్ లో ఒక వికెట్.. ఏడో ఓవర్ లో ఒక వికెట్ తీయటం ద్వారా.. ఓపెనర్లు కాన్వే, రచిన్ రవీంద్ర వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్. బిగ్ టార్గెట్ ఉండటం.. వరసగా రెండు వికెట్లు పడటంతో.. డిఫెన్స్ లో పడింది కివీస్ జట్టు.
దీన్ని అవకాశంగా తీసుకున్న భారత్ జట్టు.. న్యూజిలాండ్ పై మరింత ఒత్తిడి పెంచింది. బిగ్ షార్ట్స్ కు వెళితే ఎక్కడ ఔట్ అవుతామో.. వికెట్లు కోల్పోతామో అన్న భయంతో.. స్లోగా ఆడటం మొదలుపెట్టింది. దీంతో 17 ఓవర్లలో 100 పరుగులు మాత్రమే చేయగలిగింది. రన్ రేట్ ఆరుగా ఉండగా.. మిగతా 33 ఓవర్లలో 298 పరుగులు చేయాల్సి ఉంది. అంటే ఓవర్ కు తొమ్మిది పరుగులు కచ్చితంగా చేయాలి. దీంతో న్యూజిలాండ్ పై ఒత్తిడి పెరిగింది. షమీ వరసగా.. ముందుగా రెండు వికెట్లు తీయటం ద్వారా న్యూజిలాండ్ జట్టు కష్టాల్లో పడిందని చెప్పొచ్చు...