స్టార్ ఇండియన్ క్రికెటర్ మహ్మద్ షమీ 2023లో తన సంచలన ప్రదర్శనకు ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డును అందుకోబోతున్నారు. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ రోజు( డిసెంబర్ 20) 2023 జాతీయ క్రీడా అవార్డులు ప్రకటించింది. జనవరి 9, 2024న రాష్ట్రపతి భవన్‌లో ఈ అవార్డును షమీ అందుకోనున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి.. షమీతో సహా మొత్తం 26 మంది భారతీయ అథ్లెట్లకు ఈ అవార్డు బహుకరించనున్నారు.
ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో మహమ్మద్ షమీ అదరగొట్టాడు. మొదటి నాలుగు మ్యాచ్ లకు అతనికి అవకాశం దక్కకపోగా అడిన 7 మ్యాచ్ లలో 24 వికెట్లు పడగొట్టి లీగ్‌లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. మూడు మ్యాచ్‌ల్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. వన్డే క్రికెట్‌లో కేవలం 19 ఇన్నింగ్స్‌లలో 43 వికెట్లతో తన ఆధిపత్యాన్ని చూపించాడు.
టీమిండియా పేసర్ మహమ్మద్ షమీని ఈ ఏడాది అర్జున అవార్డుకు బీసీసీఐ సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో అతను అద్బుతంగా బౌలింగ్ చేయడంతో షమీ పేరును క్రీడా మంత్రిత్వ శాఖకు బీసీసీఐ స్పెషల్ గా రిక్వెస్ట్ చేసింది. ముందుగా క్రీడా మంత్రిత్వ శాఖకు పంపిన జాబితాలో షమీ పేరు లేదు. ఇక మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుకు పురుషుల బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి పేర్లను సిఫారసు చేయగా..వీరికి భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందజేయనున్నారు.
మన దేశంలో ఖేల్‌రత్న తర్వాత అర్జున అవార్డు రెండో అత్యున్నత క్రీడా పురస్కారంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ అవార్డులను ప్రతీఏటా ప్రదానం చేస్తారు. ఈ సంవత్సరం ఈ అవార్డులను నిర్ణయించడానికి కేంద్ర మంత్రిత్వ శాఖ 12 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వం వహిస్తారు. ఈ కమిటీలో అతనితో పాటుగా ఆరుగురు మాజీ అంతర్జాతీయ అథ్లెట్లు కూడా ఉన్నారు. మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రా, బ్యాడ్మింటన్ ప్లేయర్ త్రిప్తి ముర్గుండే మరియు పవర్‌లిఫ్టర్ ఫర్మాన్ పాషా కూడా ప్యానెల్‌లో ఉన్నారు.
Mohammed Shami has been recommended for the Arjuna Award.
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 13, 2023
- The rise of Shami...!!!! ? pic.twitter.com/BSDqGRt8ZS