షమీ పాపం చేశాడు.. మా దృష్టిలో నేరస్థుడు: ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు

షమీ పాపం చేశాడు.. మా దృష్టిలో నేరస్థుడు: ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు

టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతూ బిజీగా ఉన్నాడు. బుమ్రా లేకపోవడంతో భారత జట్టుకు కీలక ఫాస్ట్ బౌలర్ గా మారాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో 48 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో షమీ జ్యూస్ తాగుతూ కనిపించడంతో అతన్ని ఒక ముస్లిం మత గురువు టార్గెట్ చేశాడు. పవిత్ర రంజాన్ మాసంలో షమీ ఉపవాసం (రోజా) లేకపోవడమే ఇందుకు ఆయన చెప్పాడు.  ఉపవాసం (రోజా) లేకుండా షమీ పాపం చేసాడని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ బరేల్వి అన్నారు.

షాబుద్దీన్ బరేల్వి మాట్లాడుతూ.. ఇస్లాం ఉపవాసం (రోజా) తప్పనిసరి అని ప్రకటించింది. ఈ ఉపవాసం పరిణతి చెందిన పురుషులు, స్త్రీలందరికీ తప్పనిసరి. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఉపవాసం ఉండకపోతే, అది తీవ్రమైన పాపంగా పరిగణించబడుతుంది. అదేవిధంగా, మహమ్మద్ షమీ రోజాను పాటించలేదు. ఉపవాసం పాటించడం అతని మతపరమైన విధి. అయినప్పటికీ షమీ అది చేయలేదు. ఉపవాసం (రోజా) లేకపోవడం వలన షమీ నేరం చేశాడు. అతను ఇలా చేసి ఉండకూడదు. షరియత్ దృష్టిలో అతను నేరస్థుడు. మతపరంగా అతను దోషిగా నిలుస్తాడు. ఇస్లాం యొక్క బాధ్యతలను ఖచ్చితంగా పాటించాలని నేను అతనికి సలహా ఇస్తున్నాను".అని ఆయన అన్నారు.

ALSO READ | Champions Trophy 2025: ఐదు గంటలు విమానంలోనే.. సెమీ ఫైనల్ షెడ్యూల్‌పై మిల్లర్ అసంతృప్తి

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారం (మార్చి 4) సెమీ ఫైనల్ మ్యాచ్ షమీ జ్యూస్ తాగుతున్న క్లిప్ ఒకటి వైరల్ అయింది. శనివారం( మార్చి 2) నుంచి నెలవంక కనిపించడంతో ఇస్లామిక్ పవిత్ర మాసం రంజాన్ ప్రారంభమైంది.  షాబుద్దీన్ బరేల్వి షమీని విమర్శించినా నెటిజన్స్ మాత్రం ఈ టీమిండియా పేసర్ ను అభినందిస్తున్నారు. మతం కంటే దేశానికే ఎక్కువ గౌరవం ఇచ్చినందుకు అతనిపై ప్రశంసలు కురిపించారు. షమీ ఆదివారం (మార్చి 9) న్యూజిలాండ్ తో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడేందుకు సిద్ధమయ్యాడు.