టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ వరల్డ్ కప్ తర్వాత భారత జట్టులో కనిపించలేదు. గాయం కారణంగా దాదాపు 10 నెలలపాటు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. షమీ న్యూజిలాండ్ సిరీస్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటాడనుకుంటే.. ప్రస్తుతం అనుమానంగా మారింది. ఈ టీమిండియా ఫాస్ట్ బౌలర్ కు మరోసారి గాయమైంది. అతనికి మోకాలి గాయం అయినట్టు నివేదికలు చెప్పుకొస్తున్నాయి.
రంజీ ట్రోఫీలో మొదటి రౌండ్ లో ఆడదామనుకున్న షమీ.. అందుబాటులో ఉండే అవకాశం లేదు. అతను స్వదేశంలో జరగనున్న న్యూజిలాండ్ సిరీస్ కు దూరమవ్వడం ఖాయమైంది. రిపోర్ట్స్ ప్రకారం ఈ పేసర్ కు 6 నుంచి 8 వారాల రెస్ట్ అవసరమని తెలుస్తుంది. అంటే మరో రెండు నెలల పాటు అతను క్రికెట్ కు దూరంగా ఉండొచ్చు. నవంబర్ 22 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. ప్రతిష్టాత్కమైన ఈ ట్రోఫీకి షమీ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుదీర్ఘ పర్యటనలో షమీ 100 శాతం ఫిట్ నెస్ సాధించడం కష్టం. దీంతో ఈ సిరీస్ కు భారత్ కు బిగ్ షాక్ తగలనుంది.
ALSO READ | Irani Cup: పక్షిలా విన్యాసం.. మతి పోగొడుతున్న పడిక్కల్ స్టన్నింగ్ క్యాచ్
టెస్ట్ ఛాంపియన్ షిప్ కు కీలకమైన ఈ ట్రోఫీకి అనుభవజ్ఞుడు షమీ దూరమైతే భారమంతా సిరాజ్, బుమ్రాపై పడనుంది. భారత్ కు నాణ్యమైన మూడో పేసర్ లేడు. గతేడాది వరల్డ్ కప్ లో షమీ 24 వికెట్లు తీసి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత మడమ గాయానికి గురయ్యాడు. ఫిబ్రవరి నెలలో ఎడమ చీలమండకు సర్జరీ చేయించుకున్నాడు. లండన్‌లోని ఓ హాస్పిటల్‌లో ఈ సర్జరీ నిర్వహించారు.
Mohammed Shami’s recent injury setback could impact India's plans for the upcoming Border-Gavaskar series, set to begin on November 22 in Perth.
— CricTracker (@Cricketracker) October 2, 2024
The pacer, who underwent surgery in February 2024, has been on a recovery journey since then.
Source: TOI
Read more to know :… pic.twitter.com/bprtfcYVa5