IND vs ENG: జట్టుతో కలిసిన భారత స్పీడ్ గన్.. ఇక ఇంగ్లీష్ బ్యాటర్లకు చుక్కలే

IND vs ENG: జట్టుతో కలిసిన భారత స్పీడ్ గన్.. ఇక ఇంగ్లీష్ బ్యాటర్లకు చుక్కలే

14 నెలల తర్వాత భారత క్రికెట్ జట్టులో స్థానం సంపాదించుకున్న షమీ తన ఉనికిని చాటుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇంగ్లాండ్ తో బుధవారం (జనవరి 22) నుంచి ఈడెన్ గార్డెన్స్ వేదికగా రంభం కానున్న తొలి టీ20 ఆడేందుకు కసరత్తులు ప్రారంభించాడు. ఆదివారం భారత జట్టుతో చేరి ప్రాక్టీస్ లో బిజీగా కనిపించాడు. సోమవారం భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) షమీ ప్రాక్టీస్ సెషన్‌కు ఎలా వెళ్లాడు అనే వీడియోను షేర్ చేసింది. షమీ బౌలింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాల్ వైరల్ అవుతుంది. 

టీమ్ బస్సు ఎక్కి షమీ సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు ఈడెన్‌ గార్డెన్స్ చేరుకున్నాడు. భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌ను షమీ మొదటిసారిగా కలుసుకున్నాడు. షమీ బౌలింగ్ చేయడానికి ముందు వ్యాయామాలు చేశాడు. రిథమ్‌లోకి వచ్చిన తర్వాత కాసేపు మోర్నీ మోర్కెల్ తో చర్చలు జరిపాడు. ఆ తర్వాత నెట్ సెషన్ లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. సాయంత్రం 6:12 గంటలకు రౌండ్ ది వికెట్ నుండి బౌలింగ్ చేశాడు. సాయంత్రం 6:36 గంటలకు ప్రాక్టీస్ సెషన్ ముగియడంతో షమీ స్టాండ్స్‌కి వెళ్లి.. అభిమానులకు  ఆటోగ్రాఫ్‌లపై సంతకం చేశాడు.

Also Read :- IND vs ENG టీ20 సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

14 నెలల తర్వాత మళ్లీ టీమిండియా నుంచి షమీకి పిలుపు వచ్చింది. స్వదేశంలో ఇంగ్లాండ్‎తో జరగనున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్‏కు మహ్మద్ షమీని బీసీసీఐ ఎంపిక చేసింది. ఫిబ్రవరిలో చాంఫియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సిరీస్ షమీకి అగ్ని పరీక్షగా మారనుంది. ఈ సిరీస్‎లో రాణిస్తేనే ఛాంఫియన్స్ ట్రోఫిలో షమీకి జట్టులో స్థానం దక్కనుంది. యువకుల నుండి ఉన్న పోటీ దృష్ట్యా ఈ సిరీస్‎లో షమీ విఫలం అయితే.. అతడి కెరీర్ ఇక ముగిసినట్లేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో.. ఇంగ్లాండ్‎తో జరగబోయే టీ20 సిరీస్ షమీకి డూ ఆర్ డై గా మారనుంది.