Mohammed Shami: ఆ సమయంలో షమీకు సూసైడ్ ఆలోచనలు వచ్చాయి: స్నేహితుడు ఉమేష్ కుమార్

Mohammed Shami: ఆ సమయంలో షమీకు సూసైడ్ ఆలోచనలు వచ్చాయి: స్నేహితుడు ఉమేష్ కుమార్

2018లో మ‌హ్మద్ ష‌మీపై అతని మాజీ భార్య హ‌సీన్ జ‌హాన్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసింది. షమీకి పాకిస్థాన్ అమ్మాయితో స‌న్నిహిత సంబంధాలున్నాయ‌ని.. ఆమె నుంచి భారీగా డ‌బ్బులు తీసుకుంటూ మ్యాచ్ ఫిక్స్ంగ్ పాల్పడ్డాడని హ‌సీన్ జ‌హాన్ పేర్కొంది. 2018లో ష‌మీపై  హ‌సీన్ జ‌హాన్ గృహ హింస కేసును కూడా పెట్టింది. ఆ తర్వాత వ్యక్తిగ‌త జీవితంలోని ఒడిదుడుకుల వ‌ల్ల అతని కెరీర్ ప్రమాదంలో పడింది.

ఈ సమయంలో షమీకి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయని అతని స్నేహితుడు ఉమేష్ కుమార్ తాజాగా షాకింగ్ న్యూస్ బయట పెట్టాడు. తనపై వచ్చిన ఆరోపణలతో షమీ మానసికంగా కృంగిపోయాడని తెలిపాడు. షమీ నా ఇంట్లోనే ఉండేవాడు. పాకిస్తాన్‌తో ఫిక్సింగ్ ఆరోపణలు అతన్ని కోలుకోనివ్వలేదు. నా దేశానికి నమ్మకద్రోహం చేశానన్న ఆరోపణలు సహించలేకపోతున్నాను".  అని షమీ నాతో అన్నాడని ఉమేశ్ కుమార్ తెలిపారు.

ALSO READ | టీమిండియా భవిష్యత్ కెప్టెన్‌గా శుభమాన్ గిల్.. హింట్ ఇచ్చేసిన భారత చీఫ్ సెలక్టర్

షమీ ఆత్మహత్య విషయం గురించి మాట్లాడాడు. "ఆ రోజు ఉదయం 4 గంటలు అవుతుంది. నేను కిచెన్‌లోకి వెళ్తుండగా షమీ బాల్కనీలో నిలబడి ఉన్నాడు. అప్పుడు మేము 19 వ అంతస్థులో ఉన్నాం. ఆ రోజు రాత్రి అతను కఠిన నిర్ణయం తీసుకోబోతున్నాడనిపించింది. ఆ తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లను విచారించిన బీసీసీఐ ష‌మీకి క్లీన్‌చీట్ ఇచ్చింది. అప్పుడు షమీ వరల్డ్ కప్ గెలిచినంత ఆనందపడ్డాడు". అని చెప్పుకొచ్చారు.