గత కొన్నేళ్లుగా సిరాజ్ జమ్మూ కాశ్మీర్‌కి చెందిన నటి మహీరా శర్మతో ప్రేమాయణం నడుపుతున్నట్లు పలు వార్తలు బలంగా వైరల్ అవుతున్నాయి. మహీరా, సిరాజ్‌లు ఒకరినొకరు పరిచయం చేసుకున్నారని, సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవుతున్నారని వార్తలు వచ్చాయి. దీనికితోడు ఇటీవలే మహీరా శర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలని సిరాజ్ లైక్ చెయ్యడంతో ఈ వార్తలు మరింత బలమయ్యాయి. లేటెస్ట్గా నటి మహీరా శర్మ తల్లి ఈ వార్తలపై స్పందించింది. వివరాల్లోకి వెళితే..
భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్, బిగ్ బాస్ 13 ఫేమ్ మరియు నటి మహీరా శర్మతో డేటింగ్ చేస్తున్నాడని వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటి మహీరా శర్మ తల్లి సానియా శర్మ ఓ ప్రముఖ ఛానల్‌తో మాట్లాడారు.
ALSO READ | Sai Pallavi Remuneration: తండేల్ కోసం సాయి పల్లవి భారీ రెమ్యునరేషన్.. అమరన్ కంటే రూ.2కోట్లు ఎక్కువ!
"సిరాజ్, మహీరా శర్మపై వస్తోన్న పుకార్లను పూర్తిగా కొట్టిపారేసింది. ఏం మాట్లాడుతున్నారు? ఎవరో ఏదో అంటారు. ఇప్పుడు నా కూతురు ఓ సెలబ్రిటీ. ఆమె పేరును ఎవరైనా ఎవరితో అయినా లింక్ చేసి మాట్లాడతారు. వాటిని మనం నమ్మాలా? అని ప్రశ్నించారు. అలాగే సోషల్ మీడియాలో వస్తోన్న ప్రతిదీ నమ్మడం ఎలా మొదలు పెడతాం? చెప్పండి అంటూ.. ఈ రూమర్స్ పూర్తిగా అబద్ధం" అని మహీరా తల్లి సానియా శర్మ క్లారిటీ ఇచ్చింది.
మహీరా శర్మ కెరీర్:
ఇక మహీరా శర్మ విషయానికొస్తే.. జమ్మూ కాశ్మీర్లో పలు టెలివిజన్ చానల్స్ నటించి బాగానే పాపులర్ అయ్యింది. అలాగే హిందీ బిగ్ బాస్ 13వ సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొని తన ఆట తీరుతో ఆకట్టుకుంది. అయితే బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు పరస్ చాబ్రా అనే నటుడితో ప్రేమలో పడింది. అంతేగాకుండా దాదాపుగా 4ఏళ్ళపాటూ డేటింగ్లో ఉన్నారని, కానీ గత ఏడాది ఈ ఇద్దరికీ బ్రేకప్ అయ్యిందని పలు వార్తలు బలంగా వినిపించాయి.