మన సిరాజ్‌‌‌‌‌‌‌‌ మళ్లీ నం.1

దుబాయ్‌‌‌‌‌‌‌‌: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌ మహ్మద్‌‌‌‌‌‌‌‌ సిరాజ్‌‌‌‌‌‌‌‌.. వన్డేల్లో మళ్లీ వరల్డ్​ నంబర్‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌ ర్యాంక్‌‌‌‌‌‌‌‌ అందుకున్నాడు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన తాజా జాబితాలో సిరాజ్‌‌‌‌‌‌‌‌ ఎనిమిది ప్లేస్‌‌‌‌‌‌‌‌లు ఎగబాకి టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లోకి దూసుకొచ్చాడు. ప్రస్తుతం హైదరాబాదీ ఖాతాలో 694 రేటింగ్‌‌‌‌‌‌‌‌ పాయింట్లు ఉన్నాయి. ఆసియా కప్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో శ్రీలంకపై ఆరు వికెట్లు తీయడం సిరాజ్‌‌‌‌‌‌‌‌ ర్యాంక్‌‌‌‌‌‌‌‌ మెరుగుపడటానికి గణనీయంగా దోహదం చేసింది.

 జనవరిలో సిరాజ్‌‌‌‌‌‌‌‌ తొలిసారి నంబర్‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌ ర్యాంక్‌‌‌‌‌‌‌‌ను అందుకున్నాడు. మార్చిలో హాజిల్‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌ అతన్ని వెనక్కి నెట్టి టాప్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చాడు. తాజా జాబితాలో స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ కుల్దీప్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ మూడు ప్లేస్‌‌‌‌‌‌‌‌లు మెరుగుపడి 9వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చాడు. పేసర్‌‌‌‌‌‌‌‌ జస్​ప్రీత్​ బుమ్రా 27వ, హార్దిక్‌‌‌‌‌‌‌‌ పాండ్యా 50వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌ల్లో ఉన్నారు. 

బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌, రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ వరుసగా 2, 10వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌ల్లో ఉండగా, విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ ఒక్క ప్లేస్‌‌‌‌‌‌‌‌ ఎగబాకి 8వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు. ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్స్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో పాండ్యా 20వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు.