RCB Vs GT: రివెంజ్ అదిరింది: సిరాజ్ స్టన్నింగ్ డెలివరీకి సాల్ట్ క్లీన్ బౌల్డ్!

RCB Vs GT: రివెంజ్ అదిరింది: సిరాజ్ స్టన్నింగ్ డెలివరీకి సాల్ట్ క్లీన్ బౌల్డ్!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ సాల్ట్..గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ సిరాజ్ కు మధ్య అదిరిపోయే బ్యాటిల్ జరిగింది. బుధవారం (ఏప్రిల్ 2) చిన్నస్వామి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో చివరికి సిరాజ్ విజయం సాధించాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ మూడో బంతికి సిరాజ్ వేసిన షార్ట్ ఆఫ్ లెంగ్త్ డెలివరీని సాల్ట్ మిడ్‌ వికెట్‌ దిశగా భారీ సిక్సర్ కొట్టాడు.  ఈ సిక్సర్ ఏకంగా 105 మీటర్లు వెళ్లడం విశేషం. బంతి స్టేడియం బయటకు వెళ్లడంతో తర్వాత బంతిని వేయడానికి సమయం పట్టింది. 

సిరాజ్ వేసిన నాలుగో బంతికి సాల్ట్ క్లీన్ బౌల్డయ్యాడు. 144 కి.మీ వేగంతో విసిరిన ఈ బంతి స్టంప్ కు తగిలి చాలా దూరంలో పడింది. అంతక ముందు ఓవర్లో పడిక్కల్ ను బౌల్డ్ చేసిన సిరాజ్ కు ఈ వికెట్ మరింత కిక్ ఇచ్చింది. సాల్ట్ ఔటవ్వడంతో రోనాల్డ్ సెలెబ్రేషన్ తో  సిరాజ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇక చివర్లో హాఫ్ సెంచరీ చేసి జోరు మీదున్న లివింగ్ స్టోన్ (54) వికెట్ ను పడగొట్టాడు. ఓవరాల్ గా సిరాజ్ తన నాలుగు ఓవర్ల స్పెల్ లో 19 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే గుజరాత్ బౌలర్లందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులకు పరిమితమైంది. లివింగ్ స్టోన్ (40 బంతుల్లో 54: ఫోర్, 5 సిక్సర్లు) పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. సాయి కిషోర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అర్షద్ ఖాన్ , ఇషాంత్ శర్మ, ప్రసిద్ కృష్ణ తలో వికెట్ తీసుకున్నారు.