Mohammed Siraj: నన్ను వదిలేయండయ్యా.. ఆమె నాకు చెల్లెలు లాంటిది: మహమ్మద్ సిరాజ్

Mohammed Siraj: నన్ను వదిలేయండయ్యా.. ఆమె నాకు చెల్లెలు లాంటిది: మహమ్మద్ సిరాజ్

స్టార్ సింగర్ ఆశా భోంస్లే మనవరాలు జనాయ్ భోంస్లేతో భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు గుప్పుమన్నాయి. వీరిద్దరూ క్లోజ్‌గా ఉన్న ఫోటోలు నెట్టింట వైరలయ్యే సరికి ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. మన సిరాజ్ మామూలోడు కాదని కొందరంటే.. పెళ్లెప్పుడని మరొకొందరు ప్రచారం మొదలు పెట్టారు. ఇదేదో తేడా కొట్టేలా ఉండటంతో.. భారత క్రికెటర్ క్లారిటీ ఇచ్చారు. ఆమె తనకు చెల్లెలు లాంటిదని స్పష్టం చేశారు. దయచేసి అసత్య ప్రచారాలు చేయొద్దని కోరారు. 

అసలేం జరిగిందంటే..?

ఇటీవల జానాయ్ భోంస్లే పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ముంబై, బాంద్రాలోని జనాయ్ విలాసవంతమైన అపార్టుమెంట్లో జరిగిన ఆ వేడుకల్లో సిరాజ్ దర్శనమిచ్చాడు. పోనీ మనోడు అంతటితో ఊరుకున్నా పోయేది. హ్యాపీ బర్త్ డే అంటూ పాటలు పాడుతూ.. బర్త్ డే గర్ల్ పక్కన నిల్చొని ఫోటోలు దిగాడు. అవి కాస్తా క్లోజ్‌గా ఉండటంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది. దీనికి తోడు ఒకరినొకరు ఇన్‌స్టాలో ఫాలో అవుతుండడంతో సిరాజ్.. తోడు వెతుక్కున్నాడని కొన్ని స్పోర్ట్స్ ఛానెళ్లు వార్తలను ప్రచురించాయి.

 
వస్తున్న ఊహాగానాలు తేడాకొట్టేలా ఉండటంతో.. చెల్లెలు అన్న ఒక్క మాటతో సిరాజ్ అన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టాడు.

"Meri Behna Ke Jaisi Koi Behna Nahin. Bina Iske Kahin Bhi Mujhe Rehna Nahin. Jaise Hai Chaand Sitaaron Mein. Meri Behna Hai Ek Hazaaron Mein." (ఆమె లాంటి సోదరి నాకెవరూ లేరు. ఆమె లేకుండా నేను ఎక్కడా ఉండాలనుకోను. నక్షత్రాలలో చంద్రుడు ఉన్నట్లే.. ఆమె వెయ్యి మందిలో ఒకరు) అని సిరాజ్ కవిత్వాన్ని తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశాడు.

ALSO READ | Cricket Australia: అదొక్క సిరీస్ ఆడాలని ఉంది.. తరువాత దేనికైనా సిద్ధం: ఆసీస్ ఓపెనర్

ఇక సిరాజ్ క్రికెట్ కెరీర్ విషయానికొస్తే.. ఫేలవ ఫామ్‌తో ఈ హైదరాబాదీ పేసర్ భారత జట్టులో చోటు కోల్పోయాడు. వచ్చే నెలలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో సిరాజ్ లేడు. ఐపీఎల్‌లో సత్తా చాటి.. తిరిగి జట్టులో స్థానం సంపాదించాలనే పట్టుదలతో కఠిన సాధన చేస్తున్నాడు.