
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఐపీఎల్ 18వ సీజన్లో ఆకట్టుకుంటున్నాడు. ఈ ఏడాది గుజరాత్‌తో తరుఫున ఆడుతోన్న సిరాజ్ మూడు మ్యాచుల్లో 5 వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వికెట్లు తీసి.. టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ముఖ్యంగా బుధవారం (ఏప్రిల్ 2) తన ఓల్డ్ టీమ్ బెంగుళూరుపై సిరాజ్ చెలరేగిపోయాడు. రిటైన్ చేసుకోలేదని కోపమో.. వేలంలో పట్టించుకోలేదని ఆగ్రహమో తెలియదు కానీ.. మూడు వికెట్లు తీసి పాత ఫ్రాంచైజ్‌ను దెబ్బకొట్టాడు.
సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఈ మ్యాచులో ఆర్సీబీ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. ఫలితంగా గుజరాత్‌పై ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో మహ్మద్ సిరాజ్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అసలు సిరాజ్ ఎప్పటి నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు..? ఇప్పటి వరకు లీగులో ఏ ఏ టీముల తరుఫున బరిలోకి దిగాడు..? క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ ద్వారా సిరాజ్ ఎంత సంపాదించాడు..? అనే విషయాలు వైరల్ అవుతున్నాయి. మరీ సిరాజ్ ఐపీఎల్ హిస్టరీ మనం కూడా తెలుసుకుందాం.
తన ఐపీఎల్ కెరీర్‌ను 2017లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ప్రారంభించాడు సిరాజ్. ఎస్ఆర్హెచ్ రూ.2.60 కోట్లకు ఈ పేసర్‌ను కొనుగోలు చేసింది. నెక్ట్స్ సీజన్లో సిరాజ్ హైదరాబాద్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు మారాడు. 2018 నుంచి 2021 వరకు ఆర్సీబీ ప్రతి సీజన్‌కు రూ.2.60 కోట్ల చెల్లించింది. జట్టులో సిరాజ్ కీలకంగా మారడంతో 2022లో అతడి శాలరీని హైక్ చేసింది బెంగుళూరు.
2.60 కోట్ల నుంచి అమాంతం రూ.7 కోట్లకు పెంచింది. అదే ధరకు సిరాజ్ మూడు సీజన్లు (2024 వరకు) ఆర్సీబీ తరపున ఆడాడు. ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఆర్సీబీ సిరాజ్‌ను రిటైన్ చేసుకోలేదు. దీంతో సిరాజ్ మెగావేలంలో పాల్గొనగా.. గుజరాత్ టైటాన్స్12.25 కోట్ల భారీ ధరకు మియాబాయ్ని కొనుగోలు చేసింది. మొత్తానికి సిరాజ్‌కు ఇది 9 ఐపీఎల్ సీజన్. ఈ 9 సీజన్లకు కలిపి ఐపీఎల్ ద్వారా మొత్తం రూ.46.25 కోట్లు ఆర్జించాడు సిరాజ్.