ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన తర్వాత టీమిండియా కెప్టెన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ప్రెస్ కాన్ఫరెన్స్ లో లో భాగంగా రోహిత్ మాట్లాడుతూ సిరాజ్ స్థానంలో కొత్త బంతితో, డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయగల పేసర్‌ను కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఈ విషయంలో సిరాజ్ కంటే అర్ష్‌దీప్ సింగ్ ముందున్నాడని.. అందువల్లే జట్టులో చోటు కల్పించామని వివరించాడు.ఈ విషయాన్ని సిరాజ్ సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది.
తన అధికారిక ఇంస్టాగ్రామ్ లో పాత బంతి ఫోటోలను షేర్ చేశాడు. దీంతో రోహిత్ శర్మకు కౌంటర్ విసిరాడని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాత బంతితోనే సిరాజ్ తన ప్రాక్టీస్ ప్రారంభించినట్టు తెలుస్తుంది. రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్ లో బహిరంగంగా తన గురించి చెప్పడం సిరాజ్ కు నచ్చలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరపున ఆడేందుకు సిరాజ్ సిద్ధంగా ఉన్నాడు.
ALSO READ : Ranji Trophy 2025: కోహ్లీ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్.. 10 వేల మందికి ఫ్రీ ఎంట్రీ
ఛాంపియన్స్ ట్రోఫీలో కోసం భారత సెలక్టర్లు ప్రకటించిన 15 మంది స్క్వాడ్ లో సిరాజ్ కు స్థానం దక్కలేదు. ఖచ్చితంగా ప్లేయింగ్ 11 లో ఉంటాడన్న సిరాజ్ కనీసం స్క్వాడ్ లో కూడా ఎంపిక చేయలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో స్థానం దక్కకపోయినా సిరాజ్ సానుకూలంగా స్పందించాడు. త్వరలో భారత జట్టులోకి వస్తానని ధీమా వ్యక్తం చేశాడు. సిరాజ్ ను పక్కన పెట్టడానికి కారణం లేకపోలేదు. భారత జట్టులో గత ఏడాది కాలంగా వరుస అవకాశాలు దక్కించుకున్నప్పటికీ తన అత్యున్నత ప్రదర్శన ఇవ్వలేకపొతున్నాడు. దీంతో ఈ హైదరాబాదీ పేసర్ స్థానంలో అర్షదీప్ సింగ్ కు ఛాన్స్ దక్కింది.