IND vs AUS 3rd Test: టీమిండియాకు బిగ్ షాక్.. గాయంతో గ్రౌండ్ వదిలి వెళ్లిన సిరాజ్

IND vs AUS 3rd Test: టీమిండియాకు బిగ్ షాక్.. గాయంతో గ్రౌండ్ వదిలి వెళ్లిన సిరాజ్

గబ్బా టెస్టులో టీమిండియాకు బిగ్ షాక్ తగిలే అవకాశం కనిపిస్తుంది. ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ మోకాలికి గాయమైంది. 37 ఓవర్లో సిరాజ్ ఫీల్డింగ్ చేస్తూ అసౌకర్యానికి గురయ్యాడు. గ్రౌండ్ లో అతను కదలలేకపోయాడు. ఫిజియో వచ్చి సిరాజ్ కు చికిత్స అందించాడు. అయినప్పటికీ సిరాజ్ కు ఇబ్బందిగా ఉన్నప్పటికీ గ్రౌండ్ వదిలి వెళ్లాల్సి వచ్చింది. సిరాజ్ గాయం తీవ్రతపై ఎలాంటి సమాచారం లేదు. అతని గాయం పెద్దది అయితే భారత్ కు ఈ సిరీస్ లో బిగ్ షాక్ తగలనుంది.

భారత్ ఇప్పటికే షమీ లాంటి ఫాస్ట్ బౌలర్ల సేవలను కోల్పోయింది. సిరాజ్ కూడా దూరమైతే భారత్ ఫాస్ట్ బౌలింగ్ భారమంతా బుమ్రా మోయాల్సి వస్తుంది. రెండో రోజు తొలి సెషన్ లో సిరాజ్ వికెట్ తీయకపోయినా హైలెట్ గా నిలిచాడు. బెయిల్-స్విచ్ ట్రిక్‌ ఉపయోగించి  లబుషేన్ ఔట్ చేయడంలో సఫలమయ్యాడు. ఈ మ్యాచ్ లో సిరాజ్ 10.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ప్రస్తుతం బుమ్రా, ఆకాష్ దీప్ భారత పేస్ భారాన్ని మోస్తున్నారు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే రెండో రోజు లంచ్ సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. క్రీజ్ లో స్మిత్ (25), హెడ్ (20) ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రాకు రెండు వికెట్లు.. నితీష్ కుమార్ రెడ్డికి ఒక వికెట్ దక్కింది. నాథన్ మెక్‌స్వీనీ (9), ఉస్మాన్ ఖవాజా(21),లబుషేన్(12) విఫలమయ్యారు.