Mohammed Siraj: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సిరాజ్.. టీమిండియా జెర్సీ బహుకరణ

Mohammed Siraj: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సిరాజ్.. టీమిండియా జెర్సీ బహుకరణ

టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారత క్రికెటర్లకు వారి వారి సొంత నగరాల్లో గ్రాండ్ గా స్వాగతం లభిస్తుంది. తాజాగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ హైదరాబాద్ చేరుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ని కలిశారు. టీ20 వరల్డ్ కప్ గెలిచినందుకు సిరాజ్ ను సీఎం రేవంత్ రెడ్డి శాలువా కప్పి అభినందించారు. ఈ సందర్భంగా సిరాజ్ టీమిండియా జెర్సీని సీఎం రేవంత్ రెడ్డికి బహుకరించారు. 

వెస్టిండీస్, అమెరికా వేదికలుగా ఇటీవలే జరిగిన టీ20 వరల్డ్ కప్ ను భారత జట్టు గెలుచుకుంది. భారత జట్టుకు ఎంపికైనా 15 మంది స్క్వాడ్ లో సిరాజ్ ఒక సభ్యుడు. లీగ్ మ్యాచ్ ల వరకు ఆడిన సిరాజ్,.. సూపర్ 8 మ్యాచ్ లకు బెంచ్ కు పరిమితమయ్యాడు. ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఒక వికెట్ పడగొట్టాడు. పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. 

Also Read:కోహ్లీ, రోహిత్, బుమ్రాలకు రెస్ట్.. లంక పర్యటనకు కెప్టెన్ ఎవరంటే..?

సిరాజ్ ప్రస్తుతం జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్నాడు. వరల్డ్ కప్ తర్వాత రెస్ట్ ఇచ్చిన ఆటగాళ్లలో సిరాజ్ ఒకరు.ఆగస్టులో  సొంతగడ్డపై శ్రీలంకతో జరిగే మూడు వన్డేల సిరీస్‌‌‌‌‌‌‌‌కు సిరాజ్ అందుబాటులో ఉండనున్నాడు. అంతకముందు సిరాజ్ భారత ఆటగాళ్లతో పాటు ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సంగతి తెలిసిందే.