టీమిండియా పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక భారతం పడుతున్నాడు. ఒక్క ఓవర్లోనే లంక పరాజయాన్ని దాదాపుగా ఖాయం చేసి క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. తొలి 16 బంతుల్లో 5 వికెట్లు తీసి ప్రపంచ క్రికెట్ లోనే ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ గా నిలిచాడు. తన తొలి ఓవర్ మేడిన్ వేసిన ఈ హైదరాబాదీ బౌలర్.. రెండో ఓవర్లో(భారత్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్) లో ఏకంగా నాలుగు వికెట్లు తీసి లంకను పతనాన్ని శాసించాడు.
ఒక్క ఓవర్లోనే సంచలనం
ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక కు చుక్కలు చూపిస్తున్నాడు సిరాజ్. ప్రస్తుతం కొలొంబో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో శ్రీలంక టాస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్లోనే జస్ప్రీత్ బుమ్రా.. కుశాల్ పెరీరా వికెట్ తీసి శుభారంభం ఇవ్వగా.. ఆ తర్వాత సిరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. నాలుగో ఓవర్ తొలి బంతికి పాతుమ్ నిస్సాంకని పెవిలియన్ కి పంపగా.. మూడు నాలుగు బంతుల్లో సదీర సమరవిక్రమ, చరిత్ అసలంకలను అవుట్ చేసాడు. ఇక ఆర్ బంతికి ఫామ్ లో ఉన్న ధనంజయ డిసిల్వాని అవుట్ చేసి ఔరా అనిపించాడు.
ప్రస్తుతం శ్రీలంక 13 ఓవర్లలో 8 వికెట్లను 41 పరుగులు చేసి పరాజయానికి చేరువలో నిలిచింది.సిరాజ్ ఆరు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్య, బుమ్రా కి తలో వికెట్ దక్కింది.
???????????! ?
— BCCI (@BCCI) September 17, 2023
FIFER completed in under 3⃣ overs! ? ?
Outstanding bowling display from Mohd. Siraj ? ?
Follow the match ▶️ https://t.co/xrKl5d85dN#AsiaCup2023 | #INDvSL | @mdsirajofficial pic.twitter.com/a86TGe3BkD
Asia Cup 2023 final, Mohammed Siraj,India vs Sri Lanka,India vs Sri Lanka LIVE Score,cricket news, latest cricket news, sports news, V6 News
Mohammed Siraj picks six wickets