Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ నుంచి ముగ్గురు స్టార్ ప్లేయర్స్ ఔట్

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ నుంచి ముగ్గురు స్టార్ ప్లేయర్స్ ఔట్

దేశంలో జరిగే ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ ఈ సారి స్టార్ ప్లేయర్లతో కళకళలాడనుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్, బుమ్రా మినహాయిస్తే అందరు ప్లేయర్లు ఈ టోర్నీకి అందుబాటులో ఉన్నారు. అయితే తాజా సమాచార ప్రకారం ఈ ట్రోఫీ నుంచి మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, ఉమ్రాన్ మాలిక్ దూరం కానున్నారు. సిరాజ్, ఉమ్రాన్ అనారోగ్యం కారణంగా టోర్నీ ఆడట్లేదు. ముఖ్యంగా భారత జట్టులో రెగ్యులర్ ప్లేయర్ సిరాజ్ కు బంగ్లాదేశ్ సిరీస్ సమయానికి సిద్ధంగా ఉండాలని భావించి బీసీసీఐ అతనికి  రెస్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది.   

ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా టీమ్ 'బి' జట్టు నుండి రిలీజ్ చేశారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా భారత్ రానున్న నాలుగు నెలల్లో 10 టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. దీంతో కీలక ఆటగాడైన జడేజాను దులీప్ ట్రోఫీ నుంచి తప్పించారు. సిరాజ్ స్థానంలో మహమ్మద్ సైనీ.. ఉమ్రాన్ మాలిక్ స్థానంలో గౌరవ్ యాదవ్ ఈ టోర్నీ ఆడనున్నారు. మరోవైపు జడేజా స్థానంలో ఏ ఆటగాడిని ఎంపిక చేయలేదు. 

Also Read :- భారత ప్ర‌పంచ‌క‌ప్‌ జ‌ట్టు ప్ర‌క‌టన

సెప్టెంబర్ 19 నుంచి స్వదేశంలో భారత్.. బంగ్లాదేశ్ తో రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. భారత టెస్ట్ జట్టులో స్థానం దక్కించుకోవాలంటే ఈ ట్రోఫీలో కీలకంగా మారబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దులీప్ ట్రోఫీ నుంచి రెస్ట్ తీసుకున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ నేరుగా బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కు అందుబాటులో ఉంటారు.  గాయం నుంచి కోలుకున్న రిషబ్ పంత్ దాదాపు  రెండేళ్ల తర్వాత తొలిసారి టెస్ట్ సిరీస్ ఆడనున్నాడు. టోర్నీ తొలి రౌండ్ సెప్టెంబర్ 5న ప్రారంభం కానుంది. టీమ్ ఏ, టీం బి, టీమ్ సి, టీం డి జట్లకు వరుసగా శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్,  శ్రేయాస్ అయ్యర్  కెప్టెన్లుగా జట్టును నడిపిస్తారు.