న్యూఢిల్లీ: చీలమండ నొప్పితో బాధపడుతున్న హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అతనికి రెస్ట్ ఇచ్చినట్లు బీసీసీఐ తెలిపింది. దీంతో మిగతా టెస్ట్ ప్లేయర్లు అశ్విన్, రహానె, కేఎస్ భరత్, నవ్‌దీప్ సైనీతో కలిసి అతను ఇండియాకు తిరిగి వచ్చాడు.
ALSO READ:2024 టీ20 వరల్డ్‌కప్‌కు ఐర్లాండ్ క్వాలిఫై
‘విండీస్‌తో వన్డేలకు ఎంపిక చేసిన టీమ్ నుంచి సిరాజ్‌ను తప్పించాం. చీలమండ నొప్పి కారణంగా అతను స్వదేశానికి వచ్చాడు. మెడికల్ బోర్డు సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతానికి సిరాజ్ ఎన్సీఏలో ఆసియా కప్ క్యాంప్‌లో పాల్గొంటాడు. ఆ క్రమంలో వన్డే వరల్డ్‌కప్ ప్రిపరేషన్స్ కూడా మొదలుపెడతాడు’ అని బీసీసీఐ పేర్కొంది.