ఆసియాకప్ ఫైనల్లో సిరాజ్ శ్రీలంకను వణికించాడు. లంక టాప్ ఆర్డర్‌ను ముక్కలు చేశాడు. పాతుమ్ నిస్సాంకాను పెవిలియన్ చేర్చి తొలి వికెట్ ను ఖాతాలో వేసుకున్న సిరాజ్.. ఆతర్వాత చరిత్ అసలంక, సదీర సమరవిక్రమ, ధనంజయ డి సిల్వా వికెట్లను పడగొట్టాడు. దీంతో శ్రీలంక 4 ఓవర్లలో 4 వికెట్లకు 12 పరుగులు చేసింది.
ఇలా తీశాడు వికెట్లు..
సిరాజ్ వికెట్ల ఊచకోత నిస్సాంక వికెట్‌తో మొదలైంది. నిస్సాంకను లెంగ్త్ డెలివరీతో బోల్తా కొట్టించాడు. తక్కువ ఎత్తులో వచ్చిన క్యాచ్‌ను జడేజా అద్భుతంగా పట్టాడు. ఆ తర్వాత సూపర్ ఫామ్‌లో ఉన్న సమరవిక్రమను కేవలం రెండు బంతుల్లోనే ఔట్ చేశాడు. అంతకు ముందు చరిత్ అసలంక తన మొదటి బంతిని కవర్ వద్ద ఇషాన్ కిషన్‌కి పంపాడు. డిసిల్వా హ్యాట్రిక్ బంతిని లాంగ్ ఆన్ ద్వారా ఫోర్‌తో తప్పించగా, సిరాజ్ పదునైన డెలివరీతో క్యాచ్ -ఇచ్చేలా ప్రేరేపించాడు. సిరాజ్ తన అద్భుతమైన స్పెల్‌ను కొనసాగించాడు. శ్రీలంక కెప్టెన్ దసున్ షనకను తన మూడో ఓవర్‌లో నాలుగు బంతుల్లో డకౌట్ చేశాడు. ఆ తర్వాత 17 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్న కుశాల్ మెండీస్ ను బౌల్డ్ చేశాడు. దీంతో కేవలం 7 ఓవర్లు వేసి 21 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు సిరాజ్.
Also Read :- Asia Cup 2023 Final: సిరాజ్ పాంచ్ పటాకా.. క్రికెట్‌లో సరికొత్త చరిత్ర
ఒకే ఓవర్లో 4 వికెట్లు..దిగ్గజాల రికార్డు బ్రేక్..
ఆసియా కప్ 2023 ఫైనల్లో సిరాజ్ ఐదు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో మలింగా రికార్డ్‌ను బ్రేక్ చేశాడు హైదరాబాదీ పేసర్..అంతకుముందు చమిందా వాస్ రికార్డును సిరాజ్ సమం చేశాడు. కేవలం 16 బంతుల్లోనే ఈ ఫీట్‌ను చేరుకుని, వేగంగా ఐదు వికెట్లు పడగొట్టిన రికార్డు సాధించాడు. 2003లో బంగ్లాదేశ్‌పై వాస్ ఈ మైలురాయిని అందుకున్నాడు. అలాగే ఆసియాకప్ లో 6 వికెట్లు తీసిన రెండో బౌలర్ గా రికార్డులకెక్కాడు. అంతకుముందు లంక స్పిన్నర్ అజంతా మెండీస్ ఈ ఘనత సాధించాడు.