Champions Trophy 2025: తప్పు తెలుసుకున్నాను.. బాగా ఆడి కంబ్యాక్ ఇస్తా: సిరాజ్

Champions Trophy 2025: తప్పు తెలుసుకున్నాను.. బాగా ఆడి కంబ్యాక్ ఇస్తా: సిరాజ్

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఛాంపియన్స్ ట్రోఫీలో స్థానం దక్కించుకోవడంలో విఫలమయ్యాడు. భారత సెలక్టర్లు ప్రకటించిన 15 మంది స్క్వాడ్ లో సిరాజ్ పై వేటు పడింది. ఖచ్చితంగా ప్లేయింగ్ 11 లో ఉంటాడన్న సిరాజ్ కనీసం స్క్వాడ్ లో కూడా ఎంపిక చేయలేదు. సిరాజ్ ను పక్కన పెట్టడానికి కారణం లేకపోలేదు. భారత జట్టులో గత ఏడాది కాలంగా వరుస అవకాశాలు దక్కించుకున్నప్పటికీ తన అత్యున్నత ప్రదర్శన ఇవ్వలేకపొతున్నాడు. దీంతో ఈ హైదరాబాదీ పేసర్ స్థానంలో అర్షదీప్ సింగ్ కు ఛాన్స్ దక్కింది. 

ఛాంపియన్స్ ట్రోఫీలో స్థానం దక్కకపోయినా సిరాజ్ సానుకూలంగా స్పందించాడు. త్వరలో భారత జట్టులోకి వస్తానని ధీమా వ్యక్తం చేశాడు. తన అధికారిక ఇంస్టాగ్రామ్ లో "రీసెట్, రీస్టార్ట్, రీఫోకస్" అనే క్యాప్షన్‌ను జోడించాడు. సిరాజ్ షేర్ చేసిన ఫోటోలో ఈ హైదరాబాదీ పేసర్ జిమ్‌లో డంబెల్స్, ఇతర వ్యాయామ పరికరాలతో కనిపిస్తున్నాడు. భారత్ వేదికగా జరిగిన వన్డే  వరల్డ్ కప్ 2023 ముందు సిరాజ్ నెంబర్ వన్ ర్యాంకింగ్ లో ఉన్నాడు. అయితే వరల్డ్ కప్ నుంచి సిరాజ్ ఫామ్ దిగజారుతూ వస్తుంది. ఫార్మాట్ ఏదైనా సిరాజ్ విఫలమవుతున్నాడు.

సిరాజ్ గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. సిరాజ్ స్థానంలో కొత్త బంతితో, డెత్‌ ఓవర్లలో బౌలింగ్ చేయగల పేసర్‌ను కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఈ విషయంలో సిరాజ్ కంటే అర్ష్‌దీప్ సింగ్ ముందున్నాడని.. అందువల్లే జట్టులో చోటు కల్పించామని వివరించాడు. అంతేకాదు, జట్టులో ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఉండాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావించినట్లు చెప్పాడు. అర్షదీప్ విజయ్ హజారే ట్రోఫీలో 7 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు.