
- మీడియాపై నటుడు మోహన్ బాబు ఆగ్రహం
షాద్నగర్, వెలుగు : నటుడు మోహన్ బాబు మీడియాపై చిందులు తొక్కారు. గురువారం రిజిస్ట్రేషన్ పనిపై ఆయన షాద్నగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వచ్చారు. ఈ విషయం తెలియడంతో మీడియా ప్రతినిధులు కవరేజ్ చేసేందుకు వెళ్లారు. దీంతో ఆయన ‘మీడియా ప్రతినిధులకు బుద్ధి లేదా..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆ లోగోలు లాక్కొండయ్యా’ అని తన బౌన్సర్లకు సూచించారు.
అయితే, మోహన్ బాబు తన ఆస్తికి సంబంధించి వీలునామా కోసం రిజిస్ట్రార్ ఆఫీసుకు వచ్చినట్లు సమాచారం. మీడియా దృష్టిలో పడకుండా ఆయన జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది. బౌన్సర్ల అత్యుత్సాహానికి మీడియా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు.