
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందిన చిత్రం ‘కన్నప్ప’. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మిస్తూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆయన మహాదేవ శాస్త్రిగా కనిపించనున్నట్టు ఇప్పటికే రివీల్ చేయగా, బుధవారం మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన క్యారెక్టర్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ‘అడుగడుగో మహాదేవ శాస్త్రి.. ఇదిగిదిగో మహదేవ శాస్త్రి.. అతినికి మెలకువ బ్రహ్మా స్ఫూర్తి.. అడవికి మెలకువ అతని దీప్తి..’ అంటూ సాగిన ఈ గ్లింప్స్ ఆకట్టుకుంది. ఆయన లుక్ ఇంప్రెస్ చేస్తోంది.
స్టీఫెన్ దేవస్సీ కంపోజ్ చేసిన పాటకు సుద్దాల అశోక్ తేజ ఇన్‌స్పైరింగ్ లిరిక్స్ రాయగా, శంకర్ మహదేవన్ పాడిన విధానం మెస్మరైజింగ్‌గా ఉంది. ఇందులో ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ లాంటి స్టార్స్ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా ఏప్రిల్ 25న పాన్ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఒక్కొక్కరి పాత్రలను పరిచయం చేసి అంచనాలు పెంచారు మేకర్స్.