Manchu Family: మంచు మనోజ్పై మోహన్ బాబు ఫిర్యాదు..

మంచు  ఫ్యామిలీ  గొడవ పోలీస్ స్టేషన్ కు చేరింది. మంచు మోహన్ బాబు, మనోజ్ పరస్పరం ఫిర్యాదులతో ఇంటి రచ్చ కాస్త వీధికెక్కింది.  తనకు ప్రాణహాని ఉంది ..గుర్తు తెలియని 10 మంది వ్యక్తులు తన ఇంటికి  వచ్చి తనపై  దాడి చేశారని మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో డిసెంబర్ 9న సాయంత్రం ఫిర్యాదు చేశారు. విజయ్ రెడ్డి, కిరణ్ సీసీ టీవీ ఫుటేజ్ తీసుకెళ్లారని..ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే..

అయితే  మనోజ్ కంప్లైంట్ చేసిన కొన్ని గంటల తర్వాత.. మంచు మోహన్ బాబు మనోజ్ పై రాచకొండ సీపీ పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.   తన చిన్న కొడుకు మనోజ్, కోడలు మౌనిక నుంచి ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలంటూ  మోహన్ బాబు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులకు మోహన్ బాబు లేఖ రాశారు. 

మంచు మోహన్ బాబు ఫిర్యాదులో ఏముందంటే.?

నా చిన్న కొడుకు మనోజ్,చిన్న కోడలు మౌనిక నుంచి నాకు ప్రాణహానీ ఉంది. రక్షణ కల్పించండి.  నేను సీనియర్ సిటిజన్ ని. నేను జల్ పల్లిలో 10 ఏళ్లుగా నివాసం ఉంటున్నా.  మనోజ్ నాలుగు నెలల కింద ఇంటి నుంచి వెళ్లిపోయాడు..ఇపుడు తిరిగొచ్చి కలవరం సృష్టిస్తున్నాడు. మనోజ్,మౌనిక నా ఇంటిని ఆక్రమించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.  నా ఇంటిని శాశ్వతంగా ఖాళీ చేయమని నన్ను బెదిరించారు. మాదాపూర్ లోని నా ఆఫీస్ లో సిబ్బందిని బెదిరించారు.  మనోజ్, మౌనిక నాకు హాని తలపెట్టాలని చూస్తున్నారు. నా భద్రత, నా విలువైన ఆస్తుల విషయంలో భయపడుతున్నా.. మనోజ్ , అతడి అనుచరులపై చర్యలు  తీసుకోవాలి. అని లేఖలో తెలిపారు మోహన్ బాబు.

మనోజ్ ఫిర్యాదు ఇలా..

 మనోజ్ పహాడీ షరీఫ్ పీఎస్ లో  ఇచ్చిన ఫిర్యాదులో ఏముందంటే.. తాను ఇంట్లో ఉన్న సమయంలో పదిమంది గుర్తు తెలియని వ్యక్తులు  వచ్చి అరిచారనీ, అలాగే తమపై దాడి చేశారు అని ఫిర్యాదులో తెలిపాడు. ఫిర్యాదులో  మంచు మోహన్ బాబు, మంచు విష్ణు పేర్లు ఎక్కడా ప్రస్తావించలేదు మనోజ్

ALSO READ | Manchu Manoj: మంచు మనోజ్ కంప్లైంట్ లో షాకింగ్ విషయాలు.. వారందరి పేర్లు ఉన్నాయా..?

అయితే తనపై దాడి చేసిన వ్యక్తులను పట్టుకునే క్రమంలో గాయాలయ్యాయని తెలిపాడు మనోజ్. తనపై దాడి చేసిన వారి వివరాలు చెప్పలేదు.. కానీ తన కుటుంబ సభ్యులకు థ్రెట్ ఉందని చెప్పాడు. అయితే ఘటన జరిగిన తర్వాత కిరణ్ రెడ్డి విజయ రెడ్డి అనే వ్యక్తులు సీసీ ఫుటేజ్  మాయం చేశారని  కంప్లైంట్ ఇచ్చాడు మనోజ్.

100 కి డయల్ చేయగానే మేము రెస్పాండ్ అయి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించాం.. కానీ తాము వెళ్లేసరికి మనోజ్ కుటుంబ సభ్యులు తప్ప ఇతరులు లేరని పోలీసులు వెల్లడించారు.మనోజ్ కంప్లైంట్  ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు.