మోహన్ బాబుకు.. ఏం జరుగుతుందో కూడా తెలియటం లేదు: డాక్టర్ల షాకింగ్ రిపోర్ట్

హైదరాబాద్: సినీ నటుడు మోహన్ బాబు హెల్త్ బులిటెన్ను వైద్యులు విడుదల చేశారు. ఆయన చుట్టూ ఏం జరుగుతుందో మోహన్ బాబు అర్ధం చేసుకోలేకపోతున్నారని డాక్టర్లు తెలిపారు. హైపర్ టెన్షన్, బీపీతో ఆయన బాధపడుతున్నారని, ఆయన స్థిమితంగా లేరని చెప్పారు. ఆయనకు హై బీపీ ఉందని, ఎడమ కంటి కింద వాపు ఉందని వైద్యులు పేర్కొన్నారు. మరో రెండు రోజులు ఆయన ఆసుపత్రిలోనే చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు వెల్లడించారు. గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్లోని కాంటినెంటల్ హాస్పిటల్లో మంగళవారం(డిసెంబర్ 11, 2024) రాత్రి నుంచి నటుడు మోహన్ బాబు చికిత్స పొందుతున్నారు. 

ఇదిలా ఉండగా.. రాచకొండ కమిషనర్ కార్యాలయంలో హాజరు కావాలని రాచకొండ కమిషనర్ మంగళవారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం పదిన్నర గంటలకు రాచకొండ సీపీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండగా.. మోహన్ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటం గమనార్హం. అంతేకాదు.. పోలీసుల నోటీసులపై మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. 

మోహన్ బాబు తరపున హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. పోలీస్ నోటీసులను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. తనకు భద్రత కల్పించాలని ఈ పిటిషన్లో మోహన్ బాబు అభ్యర్థించారు. మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్ పై మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ జరగనుంది. ఒక న్యూస్ ఛానల్ రిపోర్టర్పై మోహన్ బాబు దాడి చేసిన ఘటన ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. 

మనోజ్ తాజా వ్యాఖ్యలు:
* నాన్న అంటే నాకు ప్రాణం.. మా నాన్న దేవుడు !
* మా నాన్న ను మా అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశారు
* మా నాన్న దృష్టిలో నన్ను శత్రువు గా చిత్రీకరించారు
* నేను నా భార్య కలిసి ఒక టాయ్స్ కంపెనీ పెట్టాము
* వాటికి కూడా అడ్డంకులు సృష్టించారు
* నాపై దాడులు చేశారు..మా నాన్న ముందే నన్ను కొట్టారు
* నాకు సపోర్ట్ చేస్తున్న మా అమ్మ ను కూడా డైవర్ట్ చేశారు
* మూడు రోజులు బయటకు వెళ్ళు, మనోజ్కి సర్ది చెప్తాం అని మా అమ్మను కూడా నమ్మించారు