మంచు మోహన్ బాబుకు చెందిన జల్ పల్లి ఫాంహౌస్ లో ఏం జరుగుతుంది..? ఇప్పుడు ఇదే ఆసక్తి రేపుతోంది. చిన్న కొడుకు మంచు మనోజ్, అతని భార్య మౌనికను ఇంటి నుంచి వెళ్లగొట్టిన కొన్ని నిమిషాల్లోనే.. మీడియాకు ఓ వీడియో లీక్ అయ్యింది. జల్పల్లి ఫాంహౌస్ లో ఏం జరుగుతుందో ఈ వీడియో స్పష్టం చేస్తుంది. అసలు ఈ వీడియో తీసింది ఎవరు..? కొట్టింది ఎవరు..? కొట్టించుకుంటున్నది ఎవరు..? కుర్చీలో పెదరాయుడి తరహాలో కూర్చున్న మోహన్ బాబు కళ్లెదుటే జరుగుతున్న ఈ ఘటన విశేషాలు ఇలా ఉన్నాయి.
ఈ వీడియోను బాగా గమనిస్తే ఒక విషయం మాత్రం స్పష్టమైంది. మోహన్ బాబు సమక్షంలోనే కొడుతున్న ఆ వ్యక్తిని గమనిస్తే ఆయన ప్రైవేట్ సెక్యూరిటీకి చెందిన వ్యక్తిగా అర్థమవుతోంది. మోహన్ బాబు ముందే ఇద్దరిపై ఆ వ్యక్తి దాడి చేశాడు. చెంపలు చెళ్లుమనిపిస్తూ ఇద్దరి దగ్గర సెల్ ఫోన్లను లాక్కుంటూ మోహన్ బాబు కుర్చీలో కూర్చుని చూస్తుండగానే ఆ వ్యక్తి కొట్టడం గమనార్హం. అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు..? వాళ్లు ఏ ఘటనను వీడియో తీసినందుకు వాళ్లపై దాడి జరిగింది..? ఎందుకు వాళ్ల సెల్ ఫోన్లను లాక్కున్నారు..? వీడియో చూశాక ఈ ప్రశ్నలే ఉత్పన్నమయ్యాయి.
అసలు ఆ వీడియోలో ఏముందో నిశితంగా గమనిస్తే..
జల్పల్లిలోని ఫాంహౌస్లో.. ఆరు బయట మోహన్ బాబు కుర్చీ వేసుకుని కూర్చున్నారు.. చుట్టూ చాలా మంది ఉన్నారు. ఆయన ఎదుట.. ఓ నల్ల షర్ట్ వేసుకున్న వ్యక్తి.. బౌన్సర్ లా ఉన్నాడు.. అతని ఓ ఇద్దరిని కొడుతున్నాడు. అతను కొడుతుంటే మోహన్ బాబు కుర్చీలో కూర్చుని చూస్తూ ఉన్నారు. పెదరాయుడి తరహాలో మోహన్ బాబు ఉంటే.. నల్ల చొక్కా వేసుకున్న వ్యక్తి.. ఓ ఇద్దరిని కొట్టటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇంత జరుగుతున్నా.. చుట్టూ ఉన్న వాళ్లు చూస్తూ ఉన్నారు.. కొడుతున్న వ్యక్తి వైపు వెళ్లలేదు. ఎక్కడి వాళ్లు అక్కడే ఉన్నారు.
Also Read:-మనోజ్, ఆయన భార్య మౌనికను ఇంటి నుంచి వెళ్లగొట్టిన మోహన్ బాబు..
జల్పల్లి ఫాంహౌస్లో మోహన్ బాబు పెదరాయుడి తీర్పు ఏమని ఇచ్చారు.. కొట్టిన వాళ్లు ఎవరు.. కొట్టించుకున్న వారు ఎవరు అనేది మాత్రం బయటకు రాలేదు. ఇంతకీ ఫాంహౌస్ లోని ఈ ఘటనను వీడియో తీసింది ఎవరు అనేది కూడా తెలియటం లేదు. మొత్తానికి వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మోహన్ బాబు పెదరాయుడి తీర్పులు ఇస్తున్నారా అనే చర్చ అయితే జరుగుతుంది.
— Samba Siva Reddy Peram (@sivareddy_peram) December 10, 2024