
కుల వ్యవస్థపై షాకింగ్ కామెంట్స్ చేశారు నటుడు మంచు మోహన్ బాబు(Manchu Mohan babu). స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రస్తుతం కుల పిచ్చి మరీ ఎక్కువైందని, అది నాశనానికి దారి తీస్తుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన కామెంట్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ALSO READ :The Soul Of Satya: సాయి ధరమ్, కలర్స్ స్వాతి.. ది సోల్ అఫ్ సత్య సాంగ్ రిలీజ్
ఆగస్టు 15, 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని తన యూనివర్సిటీలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు మోహన్‌బాబు. ఆ గ్రామస్థులతో కలిసి 100 మొక్కలు నాటారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఇంత ఉన్నత స్థాయికి ఎదగడానికి కారణమైన నా తల్లిదండ్రులకు, ఈ జన్మభూమిని ఎప్పుడూ మర్చిపోనని చెప్పుకొచ్చారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు కులాలు ఉన్నప్పటికి అందరూ కలిసి మెలసి ఉండేవారు, ఆప్యాయంగా పిలుచుకునేవారు, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. కులం పేరుతో ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారు. నా చిన్నతనంలో నాతోటి వాడిని అంటరానివాడన్నాడని వాడిని చెప్పుతో కొడతానన్నాను. అందుకే నాకు కుల వ్యవస్థ అంటే అసహ్యం అని చెప్పుకొచ్చారు మోహన్‌బాబు.