మంచు తుఫాను: మోహన్ బాబుకు పెరిగిన హార్ట్ రేట్.. మంచు విష్ణు సీరియస్ వార్నింగ్..

హైదరాబాద్: జర్నలిస్ట్పై మోహన్ బాబు దాడి చేయడంతో మంచు కుటుంబ వివాదం కొత్త మలుపు తిరిగింది. కుటుంబ వివాదంపై మీడియాలో, సోషల్ మీడియాలో ఉన్న ఫోకస్ కాస్తా మోహన్ బాబు దాడి వైపు మళ్లింది. ఈ క్రమంలో.. మంచు విష్ణు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. మీ అందరికీ ఇది ఒక బిగ్ బాస్ షో లెక్కన ఉందని, ఇక్కడితో ఈ ఇష్యూను వదిలేయండని మీడియాను మంచు విష్ణు కోరాడు. ఈ వివాదంలో బయట వారు ఎవరైనా ఇన్వాల్ అయితే వారికి ఈ రోజు సాయంత్రం వరకు సమయం ఇస్తున్నామని మంచు విష్ణు అల్టిమేటం జారీ చేశాడు.

ఎంత మంది విడిపోలేదు.. ఎంత మంది కలవలేదని.. మళ్లీ అంతా కలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. నాన్న చేసిన తప్పు తమను విపరీతంగా ప్రేమించడం అని వేదాంత ధోరణిలో మంచు విష్ణు మాట్లాడాడు. మీడియా అందరినీ తప్పు పట్టడం లేదని, కొంత మంది లిమిట్స్ క్రాస్ చేస్తున్నారని విష్ణు అభిప్రాయపడ్డాడు. వినయ్ తనకు ఒక అన్న లాంటి వాడని చెప్పాడు. పోలీసులు తమకు నోటీసులు ఇవ్వక ముందే ప్రెస్కు లీకులు ఇస్తున్నారని, కమిషనర్ ముందు హాజరవుతానని మంచు విష్ణు తెలిపాడు.

మోహన్ బాబు హెల్త్ బులిటెన్ అంశాలు:
* బాడీ పెయిన్స్, యాంగ్జైటీ, కాన్షియస్ లేకపోవడం వంటి ఆరోగ్య సమస్యలతో అడ్మిట్ అయినట్లు వైద్యుల ప్రకటన
* స్పెషలిస్ట్ వైద్యులతో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అవసరం 
* బ్లడ్ ప్రెజర్ పెరిగి, ఎడమ కంటి సమస్య తలెత్తింది
* హార్ట్ రేట్ పెరిగి, ఫ్లక్చువేట్ అవుతుంది
* కార్డియాలజిస్ట్, న్యూరో, ప్లాస్టిక్ సర్జన్స్ వంటి వైద్యులతో ఇమిడియట్ ట్రీట్మెంట్ అవసరం