నాన్న నమస్కరిస్తూనే మీడియా ముందుకు వచ్చారు.. మొహం మీద మైకు పెట్టడం వల్లే కొట్టారు: మంచు విష్ణు

హైదరాబాద్: మోహన్ బాబు చికిత్స పొందుతున్న గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్లో మంచు విష్ణు ప్రెస్మీట్ నిర్వహించాడు. ఇలాంటి ప్రెస్మీట్ పెట్టాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదని చెప్పాడు. మూడు తరాలుగా తమ కుటుంబం మీడియాతో సత్సంబంధాలు కలిగి ఉందని విష్ణు గుర్తు చేశాడు.

ప్రతి ఇంట్లో ఇష్యూస్ ఉన్నాయని, ఎక్కువ మాట్లాడితే ఎక్కడో బ్రేక్ డౌన్ అవుతామని, తనకు ఇది చాలా బాధాకరమైన పరిస్థితి అని ఆయన చెప్పాడు. తామేంటో ఇండస్ట్రీ మొత్తానికి తెలుసని, మీడియాకి విజ్ఞప్తి చేస్తున్నానని, మీడియాలో పనిచేస్తున్న వారికి కూడా కుటుంబాలు ఉన్నాయని, తండ్రులు ఉన్నారని.. ఉమ్మడి కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయని విష్ణు చెప్పుకొచ్చారు.

Also Read :- మోహన్ బాబుకు.. ఏం జరుగుతుందో కూడా తెలియటం లేదు

సెన్సేషన్ ఎందుకు అవుతుందో తెలియడం లేదని, కేవలం తాము సెలబ్రిటీస్ కావడం వల్ల ఇలా చేస్తున్నారా అని మీడియాను విష్ణు ప్రశ్నించాడు. మీడియాలో కొంత మంది హద్దులు దాటిపోయారని మంచు విష్ణు వ్యాఖ్యానించాడు. మీడియా ప్రతినిధికి గాయాలు కావడం దురదృష్టకరమని, జరిగిన ఘటన ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి కాదని చెప్పాడు. నాన్న నమస్కరిస్తూ మీడియా ముందుకు వచ్చారని, మొహం మీద మైకు పెట్టడంతో క్షణికావేశంలో కొట్టారని మంచు విష్ణు రిపోర్టర్పై దాడి ఘటన గురించి చెప్పుకొచ్చాడు.