హైదరాబాద్: ప్రముఖ నటుడు మోహన్ బాబు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. 2024, డిసెంబర్ 10వ తేదీన హైదరాబాద్ శివారు జల్ పల్లిలోని తన ఇంటి వద్ద జరిగిన గొడవ వల్ల ఆయన అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వెంటనే మోహన్ బాబును ఆయన పెద్ద కుమారుడు విష్ణు ఆసుపత్రికి తరలించారు. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డైలాగ్ కింగ్ చికిత్స పొందారు.
తన ఇంటి వద్ద జరిగిన వివాదం వల్ల మోహన్ బాబు షాక్‌కు గురయ్యారని.. తన చుట్టు ఏం జరుగుతుందో కూడా ఆయనకు అర్థం కావడం లేదని వైద్యులు బులెటిన్‌లో తెలిపారు. రెండు రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం మోహన్ బాబు కోలుకున్నారు. దీంతో వైద్యులు డిశ్చార్జ్ చేయడంతో ఆయన గురువారం (డిసెంబర్ 12) ఆసుపత్రి నుండి ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. పూర్తిగా కోలుకోవడానికి కాస్త సమయం పడుతోందని డాక్టర్లు తెలిపారు.
కాగా, మంచు ఫ్యామిలీ వార్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన విషయం తెలిసిందే. ఒకరిపై ఒకరు కేసులు, దాడులకు దిగడంతో మంచు ఫ్యామిలీ గత నాలుగు రోజులుగా సోషల్ మీడియా, మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. మంగళవారం (డిసెంబర్ 10) హైదరాబాద్ శివారు జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద చోటు హైడ్రామా చోటు చేసుకుంది.
ALSO READ | మోహన్ బాబు, మనోజ్ గొడవలో ఎందుకు జోక్యం చేసుకోలేదో చెప్పేసిన మంచు లక్ష్మి..!
తండ్రి మోహన్ బాబు ఇంటికి ఆయన కుమారుడు మనోజ్ వెళ్లగా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మనోజ్ గేట్లు తోసుకుని బలవంతంగా మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లాడు. ఈ క్రమంలో మోహన్ బాబు నివాసం వద్ద హై టెన్షన్ నెలకొంది. ఈ పరిణామాలతో తీవ్ర ఆగ్రహానికి గురైన మోహన్ బాబు.. తన ఇంటి వద్ద జరుగుతోన్న పరిస్థితులను కవరేజ్ చేసేందుకు వచ్చిన జర్నలిస్టులపై భౌతిక దాడులకు దిగాడు.
ఏకంగా జర్నలిస్టుల చేతిలో మైకును లాక్కునే వారిపైనే దాడి చేశాడు. ఫ్యామిలీ ఇష్యూ, మీడియాపై దాడి చేయడంతో రాచకొండ పోలీసులు మోహన్ బాబుపై సీరియస్ అయ్యారు. మంచు ఫ్యామిలీ లొల్లి మరింత ముదరటంతో విచారణకు హాజరు కావాలంటూ మంచు మోహన్ బాబు, మనోజ్, విష్ణుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసుల ఆదేశాల మేరకు బుధవారం (డిసెంబర్ 11) మనోజ్ విచారణకు హాజరు కాగా.. మోహన్ బాబు, విష్ణు పోలీసుల ఎదుట హాజరు కాలేదు. పోలీసుల నోటీసులను మోహన్ బాబు కోర్టులో సవాల్ చేయగా.. న్యాయస్థానంలో డైలాగ్ కింగ్‌కు స్వల్ప ఊరట దక్కింది.