మనోజ్పై దాడి కేసులో మోహన్ బాబు మేనేజర్ కిరణ్ అరెస్ట్..

మంచు మనోజ్ పై దాడి కేసులో మోహన్ బాబు మేనేజర్( ప్రధాన అనుచరుడు) కిరణ్ కుమార్ ను పహాడీషరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై దాడి చేసి సీసీ టీవీ ఫుటేజ్, హార్డ్ డిస్క్ లు ఎత్తుకెళ్లారని కిరణ్,విజయ్ అనే ఇద్దరి వ్యక్తులపై డిసెంబర్ 9న  మనోజ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. కిరణ్ ను ఇవాళ అరెస్ట్ చేయగా.. మనోజ్ పై దాడి జరిగినప్పటి నుంచి  విజయ్ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

మళ్లీ అన్నదమ్ముల వార్నింగ్

మరో వైపు తమ కుటుంబ సమస్యను  కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుంటామని చెప్పిన మంచు బ్రదర్స్ జల్ పల్లిలోని మోహన్ బాబు  ఫాంహౌస్ దగ్గర మరోసారి ఉద్రిక్తత వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఫాంహౌస్ నుంచి  ప్రైవేట్ వ్యక్తులు బయటకు వెళ్లిపోవాలని మనోజ్ వార్నింగ్ ఇచ్చారు.   వెంటనే విష్ణు జోక్యం చేసుకుని ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు ఎవరూ లేరని బదులిచ్చారు.  మనోజ్ కు సంబంధించిన ప్రైవేట్ వ్యక్తులు కూడా బయటకు వెళ్లాలని విష్ణు వారికి వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు ప్రైవేట్ వ్యక్తులనంతా ఫాంహౌస్ నుంచి బయటకు పంపారు.  దీంతో మళ్లీ ఏం జరుగుతుందోనని  ఉత్కంఠ నెలకొంది.

రాచకొండ సీపీ ముందు  విచారణకు హాజరైన మనోజ్.. సమస్యను సామరస్యంగా పరిష్కించేందుకు తాను సిద్ధమని చెప్పారు. పోలీసులు తనకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. ఇంతటితో ఈ వివాదాన్ని వదిలేయాలని చెప్పారు. వినయ్ అనే వ్యక్తి వల్లే తమ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చాయని చెప్పారు.