కేసీఆర్ ఖేల్ ఖతం.. వచ్చేది కాంగ్రెస్ రాజ్యమే: మోహన్ జోషి

కేసీఆర్ ఖేల్ ఖతం.. వచ్చేది కాంగ్రెస్ రాజ్యమే: మోహన్ జోషి

బెల్లంపల్లి, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్ పరిపాలనలో సీఎం కేసీఆర్ అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలతో జనం విసుగు చెందారని, ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఖేల్​ఖతమవుతుందని ఏఐసీసీ సెక్రటరీ, బెల్లంపల్లి నియోజకవర్గ పరిశీలకుడు మోహన్ జోషి అన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ అభ్యర్థి, మాజీ మంత్రి గడ్డం వినోద్ ఆధ్వర్యంలో శనివారం బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ బూత్ కమిటీల సమావేశానికి మోహన్ జోషి చీఫ్ గెస్ట్‌‌గా హాజరై ప్రసంగించారు.

కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిందన్నారు. తెలంగాణకు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో స్పందన వచ్చిందన్నారు. ఈ గ్యారంటీలను మరింత విస్తృతం చేయాలని కోరారు. బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలు గడ్డం వినోద్ కు ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమారి సూరిబాబు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కారుకూరి రామచందర్, నాయకులు ఎం.నర్సింగరావు, రుద్రబట్ల సంతోష్, చిన్న రాజం, రత్నం ప్రదీప్, ఎండీ ఈసా తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్​లోకి కంకణాల పద్మారెడ్డిసీడీఎస్ కమిటీ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర  మహిళా నాయకురాలు కంకణాల పద్మారెడ్డి ఈ సందర్భంగా కాంగ్రెస్​లో చేరారు. గడ్డం వినోద్ ఆధ్వర్యంలో ఆమె పార్టీలో చేరగా మోహన్ జోషి కాంగ్రెస్​ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.