దృశ్యం 3 అనౌన్స్ చేసిన మోహన్ లాల్..

దృశ్యం 3 అనౌన్స్ చేసిన మోహన్ లాల్..

మోహన్ లాల్ హీరోగా వచ్చిన క్రైమ్ థ్రిల్లర్‌‌‌‌ ‘దృశ్యం’. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రీమేక్‌‌ అయింది. ఆ తర్వాత ఈ ఫ్రాంచైజీలో వచ్చిన రెండో భాగం కూడా సూపర్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు మూడో భాగం రాబోతోంది. గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు. ‘గతం ఎప్పుడూ మౌనంగా ఉండదు.. ‘దృశ్యం 3’ వస్తోంది..’ అంటూ మోహన్‌‌లాల్ ఈ ప్రాజెక్ట్‌‌ను అనౌన్స్ చేశారు. 

గత రెండు భాగాలతో మెప్పించిన జీతూ జోసెఫ్‌‌ దీన్ని  డైరెక్ట్ చేయనుండగా.. ఆంటోనీ పెరుంబవూర్‌‌‌‌ నిర్మిస్తున్నారు. పోలీస్‌‌ ఆఫీసర్‌‌‌‌ కొడుకును అనుకోని పరిస్థితుల్లో తన కుటుంబం హత్య చేయగా, ఆ కేసు నుంచి తన ఫ్యామిలీ మెంబర్స్‌‌ను జార్జి కుట్టి ఎలా రక్షించుకున్నాడు అనే కథతో ఫస్ట్ పార్ట్ వచ్చింది. రెండో భాగంలో కేసు రీ ఓపెన్ అవగా తన తెలివి తేటలతో మరోసారి కాపాడుకుంటాడు.  మరి ‘దృశ్యం 3’లో ఏం జరగబోతోందో అనే ఆసక్తి నెలకొంది.