L2 Empuraan OTT: అఫీషియల్.. ఓటీటీలోకి మలయాళం బ్లాక్‌బస్టర్ ఎంపురాన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

L2 Empuraan OTT: అఫీషియల్.. ఓటీటీలోకి మలయాళం బ్లాక్‌బస్టర్ ఎంపురాన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మలయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఎల్ 2 ఎంపురాన్ (L2 Empuraan). పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్స్టార్ భారీ ధరకు దక్కించుంది.

లేటెస్ట్గా ఎల్ 2 ఎంపురాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఏప్రిల్ 24 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్కు రానున్నట్లు సదరు ఓటీటీ సంస్థ ప్రకటించింది.

“అబ్రహం ప్రపంచం ఇక్కడ ప్రారంభం అవుతుంది. ఎల్2: ఎంపురాన్ ఏప్రిల్ 24 నుంచి కేవలం జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది” అనే క్యాప్షన్ తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్కు అందుబాటులో ఉండనుంది.

ఎల్ 2 ఎంపురాన్ మూవీ 2025 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేయడంతో పాటు కీలక పాత్రలో నటించి మెప్పించాడు. ఈ మూవీ వరల్డ్ వైడ్గా రూ.250 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు చేసి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్గా నిలిచింది.అంతేకాకుండా మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా చరిత్ర సృష్టించింది.

అయితే వసూళ్లతో పాటుగా వివాదాలు కూడా ఈ సినిమాను చుట్టుముట్టాయి. 2002 గుజరాత్ గోద్రా అల్లర్లకు సంబంధించిన సీన్స్, ఈ మూవీలో చూపించారని, పెద్ద ఎత్తున్న అల్లర్లు చెలరేగాయి. దాంతో 17 సీన్స్ ను కట్ చేయాల్సి వచ్చింది. అలాగే, మోహన్ లాల్ సైతం క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. 

ఇకపోతే, ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్‌, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్, మంజు వారియర్‌, టోవినో థామస్, సచిన్‌ ఖేడ్కర్‌, అభిమన్యు సింగ్‌ తదితరులు నటించారు. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీని తమిళ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌‌‌‌ ఆశీర్వాద్ సినిమాస్‌‌‌‌ సంయుక్తంగా నిర్మించాయి. తెలుగులో దిల్ రాజు ప్రొడ్యూస్ చేశాడు. మురళి గోపి కథను అందించారు.