OTT అందుబాటులోకి వచ్చాక భాషతో సంబందం లేకుండా సినిమాలు చూస్తున్నారు ఆడియన్స్. కంటెంట్ బాగుంటే చాలు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకే మేకర్స్ కూడా పళ్ళు భాషల్లో హిట్టైన సినిమాలను డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అందులో భాగంగా వచ్చిన లేటెస్ట్ మూవీ నేరు. మలయాళ స్టార్ యాక్టర్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ కోర్ట్ రూమ్ డ్రామాకి దృశ్యం సినిమాల దర్శకుడు జీతూ జోసఫ్ దర్శకత్వం వహించారు. ఈ ఇద్దరి హిట్ కాంబోలో వచ్చిన నేరు సినిమా కూడా అనూహ్య విజయాన్ని సాధించింది.
కోర్టు రూమ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుండే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.86 కోట్ల వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నిజానికి ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. దీంతో తాజాగా ఈ సినిమాలో OTTలో రిలీజ్ చేశారు మేకర్స్. జనవరి 23 అర్ధరాత్రి నుండి నేరు మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక నేరు సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో ప్రియమణి, శాంతి, జగదీశ్, గణేష్ కుమార్, నందు, అదితి రవి తదితర నటులు కీ రోల్స్ చేశారు. ఒక కళ్ళు లేని అమ్మాయి రేప్ కి గురవుతుంది. ఆమె కేసు వాదించడానికి మోహన్ లాల్ రంగం లోకి దిగుతారు. ఆ దారిలో అతనికి ఎదురైనా సవాళ్లేమిటి? కళ్ళు లేని ఆ అమ్మాయి ఆ వ్యక్తిని ఎలా గుర్తుపట్టింది? చివరికి ఆ అమ్మాయికి న్యాయం జరిగిందా? అనేది నేరు సినిమా కథ. వీలుంటే మీరు కూడా చూసేయండి నచ్చుతుంది.