- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్ రావు పటేల్
భైంసా, వెలుగు : ప్రజలను అన్నింటా మోసం చేస్తున్న కేసీఆర్ గడీల పాలనను బద్దలు కొట్టడం బీజేపీతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్ రావు పటేల్ అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా భైంసా మండలం మహగాంలో ‘పల్లెపల్లెకు బీజేపీ.. గడప గడపకు మోహన్ రావు’ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలు, సీఎం కేసీఆర్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు.
బంగారు తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీకే దక్కాయని విమర్శించారు. కేసీఆర్ధోఖా పాలనను ఖతం చేసి స్వేచ్ఛ పాలనను అందించే బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ రాకేశ్, లీడర్లు పోశెట్టి, శ్రీను, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.