
భైంసా, వెలుగు : బంగారు తెలంగాణ చేస్తానని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్సర్కార్బతకలేని తెలంగాణగా మార్చారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్రావు పటేల్అన్నారు. శనివారం భైంసా మండలంలోని చుచుంద్, పాంగ్రి గ్రామాల్లో కేంద్ర పథకాలపై ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ దుబారా ఖర్చులు చేసి అప్పుల పాలు చేశారని ఆరోపించారు. కేంద్ర పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సుభాష్జాదవ్, లీడర్లు దిలీప్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.