కోమటిరెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : గుమ్ముల మోహన్ రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు:  కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గెలుపు కోసం  పార్టీ శ్రేణులు బూత్ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ పట్టణ   అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి కోరారు. గురువారం పట్టణంలోని 5వ వార్డు ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారంటీ స్కీం పథకాలను ఇంటింటికి వివరించాలన్నారు. కష్టపడి పనిచేసే వారికి కచ్చితంగా తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.    కార్యక్రమంలో నల్లగొండ అశోక్, జడ్పీటీసీ లక్ష్మయ్య,  భద్రాద్రి, రవీందర్, సంజయ్, భగత్, వంశీ, పున్న వెంకన్న, జానయ్య, ఆనంద్, పున్న పవన్, వెంకన్న, నరేశ్, రాము, సందీప్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : సర్కార్ వారి అమ్మకం: ఉల్లి కిలో 25 రూపాయలే