L2 Empuraan X Review: మోహన్ లాల్ పొలిటికల్ థ్రిల్లర్ ‘లూసిఫర్‌‌‌‌‌‌‌‌ 2’ X రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

L2 Empuraan X Review: మోహన్ లాల్ పొలిటికల్ థ్రిల్లర్ ‘లూసిఫర్‌‌‌‌‌‌‌‌ 2’ X రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

మలయాళ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎల్‌‌‌‌ 2: ఎంపురాన్‌‌‌‌’(L2 Empuraan). సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్‌‌‌‌‌‌‌‌’కు ఇది సీక్వెల్. హీరో పృథ్విరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేస్తుండటంతో పాటు కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ నేడు (మార్చి 27న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది.

దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీని తెలుగులో దిల్ రాజు ప్రొడ్యూస్ చేశాడు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఎల్‌‌‌‌ 2: ఎంపురాన్‌‌‌‌’ టాక్ ఎలా ఉందో X రివ్యూలో చూద్దాం. 

ఎంపురాన్‌ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. ఈ మూవీలో మోహన్‍లాల్ మరింత శక్తివంతంగా కనిపిస్తున్నాడని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మొదటి భాగం లూసిఫర్ కంటే ‘ఎల్‌‌‌‌ 2: ఎంపురాన్‌‌‌‌’ గ్రాండ్ గా ఉందని అంటున్నారు. కథలో డెప్త్, స్క్రీన్‌ప్లేలో ఉన్న ఉత్కంఠను నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. 

ALSO READ | RC16: రామ్ చరణ్-బుచ్చిబాబు మూవీ టైటిల్ ఫిక్స్.. రూర‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త పోస్టర్

ఓ నెటిజన్ స్పందిస్తూ.. లైట్‌ స్టోరీ టెల్లింగ్‌తో ఫస్టాఫ్‌ ఆకట్టుకునేలా ఉంది. ఇంటర్వెల్‌ సీన్‌, సెకండాఫ్‌ అదిరిపోతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ బాగుంటుందని ఓ నెటిజన్‌ X లో కామెంట్‌ చేశాడు.

ఎంపురాన్ మూవీలో దాదాపు గంట తరువాత మోహన్‌లాల్ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. మోహన్‌లాల్ ఎంట్రీ అదిరిపోయింది. పూర్తి కమర్షియల్ స్టఫ్ అని అంటున్నారు. హాలీవుడ్ లెవెల్లో స్టంట్స్, విజువల్స్ అని చెబుతున్నారు. 

సినిమా నెమ్మదిగా అంతర్జాతీయ స్థాయి విజువల్స్ తో మొదలవుతుంది. డైలాగ్స్ అదిరిపోయాయి. మోహన్ లాల్ ఎంట్రీ తర్వాత సినిమా బ్యాంగర్ ఇంటర్వెల్ తో వేగం పుంజుకుంటుంది. మలయాళ సినిమాకి ఉత్తమ ఇంటర్వెల్ ఇదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. సెకండ్ హాఫ్ పృథ్వీరాజ్ సుకుమారన్ టచ్ తో వచ్చే పోరాట సన్నివేశాలు మాలీవుడ్ లో KGF2 అవుతుందని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఇది మోహన్ లాల్ నుండి మరో బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పొచ్చు అంటూ Xలో రివ్యూ ఇచ్చాడు.