![లిజో జోస్ పెల్లిస్సెరీ దర్శకత్వంలో మోహన్‌లాల్](https://static.v6velugu.com/uploads/2022/10/Mohanlal-announces-film-with-Lijo-Jose-Pellissery_7hDxjigPys.jpg)
ఆల్రెడీ తొమ్మిది సినిమాల్ని లైన్‌లో పెట్టిన మోహన్‌లాల్ ఇప్పుడు మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘జల్లికట్టు’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన లిజో జోస్ పెల్లిస్సెరీ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ‘నా నెక్స్ట్ ప్రాజెక్ట్ లిజో జోస్‌తో చేయబోతున్నానని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఎంతో ఉత్సాహం, ప్రతిభ ఉన్న దర్శకుల్లో ఆయన ఒకరు’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు లాల్. జాన్, మేరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం నటీనటులు, టెక్నీషియన్ల ఎంపిక జరుగు తోంది. అతి త్వరలో సినిమా సెట్స్‌కి వెళ్లనుంది. నిజానికి ‘దృశ్యం 2’ తర్వాత రిలీజైన మోహన్‌లాల్ సినిమాలన్నీ నిరాశపర్చాయి. రీసెంట్‌గా విడుదలైన ‘మాన్‌స్టర్’ కూడా మిక్స్డ్ టాకే తెచ్చుకుంది. నెక్స్ట్ ఆయన నుంచి ‘అలోన్’ చిత్రం రాబోతోంది. ఇంకా ఆయన డైరెక్ట్ చేస్తూ నటిస్తున్న ‘బారోజ్’, ‘లూసిఫర్’ సీక్వెల్ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో పాటు మరికొన్ని సినిమాలు కూడా మోహన్‌లాల్ చేతిలో ఉన్నాయి. కాబట్టి ఒకట్రెండు సినిమాలు విడుదలయ్యాక లిజోతో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందంటున్నాయి మాలీవుడ్ వర్గాలు.