
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ 'ఎల్2 ఎంపురాన్'. (లూసిఫర్2). ఇటీవలే ట్రైలర్ రిలీజ్ అవ్వగా ప్రేక్షుకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 3 నిమిషాల 50 సెకన్ల ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. యాక్షన్, డ్రామాతో కూడిన సీన్స్ ఇంపాక్ట్ ఇస్తున్నాయి.
పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మార్చి 27న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మోహన్‌లాల్-పృథ్వీరాజ్ ఓ ప్రముఖ ఇంగ్లీష్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా డైరెక్టర్ పృథ్వీరాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు.
పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. "మోహన్‌లాల్ కారణంగానే ‘లూసిఫర్2: ఎంపురాన్’తెరకెక్కిందన్నారు. ఈ సినిమా కోసం మోహన్‌లాల్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదు. ఆయన రెమ్యూనరేషన్ తీసుకోలేదు కాబట్టే ఈ సినిమా తెరకెక్కిందనడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, మోహన్‌లాల్ పారితోషికాన్ని కూడా సినిమా కోసమే ఖర్చు పెట్టాం. స్క్రీన్‌పై చూస్తే మీకు ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది.
ఇందులో హాలీవుడ్, బ్రిటిష్ మరియు చైనీస్ చిత్ర పరిశ్రమల నుండి కొంతమందిని సెలెక్ట్ చేశాం. టెక్నీకల్ టీంతో సహా అందరినీ బెస్ట్ తీసుకున్నాం. దాదాపు కేటాయించిన 100 కోట్ల బడ్జెట్లో వారికే సగం రెమ్యునరేషన్ ఖర్చు అయింది. అందులో 80 కోట్లు రెమ్యునరేషన్కి వెళ్లాయి, మిగిలిన 20 కోట్లు సినిమా నిర్మాణానికి ఖర్చు చేశామని, సినిమా నిర్మాణంలో తాము కూడా పెట్టుబడి పెట్టామని పృథ్వీరాజ్ అన్నారు.
సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకపోవడంపై వైరల్ అవుతోంది. మోహన్ లాల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్లలో లూసిఫర్ మూవీ ఒకటి. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిందే ఎల్2 ఎంపురాన్. అలాంటిది తాను ఎంత కోరితే నిర్మతలు ఎంత అవ్వడానికైనా సిద్ద పడే ఛాన్స్ ఉంది. అయినా, రెమ్యునరేషన్ తీసుకోలేదంటే, వచ్చే కలెక్షన్స్ లో వాటా తీసుకోనున్నాడా? లేక పృథ్వీరాజ్ పై ఉన్న ప్రేమతో వదులుకున్నాడా? అనేది క్లారిటీ తెలియాల్సి ఉంది.
ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన 'ఎంపురాన్' మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ పాన్-ఇండియన్ చిత్రం మలయాళం, తమిళం, తెలుగు, హిందీ మరియు కన్నడ భాషలలో ఏకకాలంలో విడుదల కానుంది. నటుడు పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మురళి గోపి రచన చేశారు.