
2025 ఉగాది సందర్భంగా థియేటర్లలలో కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. అందులో తెలుగు, తమిళ మరియు మలయాళ భాషా చిత్రాలు రానున్నాయి. ఈ సినిమాల నుంచి ఇప్పటికే టీజర్, ట్రైలర్ విజువల్స్ వచ్చి సినీ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. ముఖ్యంగా ఈ పండుగ బరిలో భారీ బడ్జెట్ చిత్రాలుగా వస్తోన్న తమిళ, మలయాళ సినిమాల గురించి తెలుసుకుందాం. మరి ఆ సినిమాలేంటీ? వాటికి ప్రేక్షకుల్లో ఉన్న బజ్ ఎలాంటిదో ఓ లుక్కేద్దాం.
వీర ధీర శూరన్:
వైవిధ్యమైన పాత్రలతో సినిమాలు చేసే అతి కొద్ది మంది హీరోల్లో చియాన్ విక్రమ్ (ChiyaanVikram)ఒకరు. ప్రస్తుతం ఎస్.యు.అరుణ్‌కుమార్ (S.U.Arun Kumar) డైరెక్షన్ లో ‘వీర ధీర శూరన్’ (Veera Dheera Sooran) ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ మార్చి 27, 2025న థియేటర్స్ లోకి వస్తుంది. అయితే, రెండు భాగాలుగా రూపొందిన ‘వీర ధీర శూరన్’.. పార్ట్ 2ను ముందుగా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. రియా శిబు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాని NVR సినిమాస్, మైత్రి సంస్థలు తెలుగులో రిలీజ్ చేస్తోన్నాయి.
లూసిఫర్ 2:
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘L2 ఎంపురాన్’. పృథ్విరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేస్తుండటంతో పాటు కీలకపాత్ర పోషిస్తున్నాడు. సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’కు ఇది సీక్వెల్. ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన 'ఎంపురాన్' మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ALSO READ | ఇదెక్కడి మాస్ రా మావ.. ఎల్2: ఎంపురాన్ సినిమాకి హాలిడే ఇచ్చిన కాలేజ్.. టికెట్ కూడా ఫ్రీ..ఎక్కడంటే.?
ఈ పాన్-ఇండియన్ చిత్రం మలయాళం, తమిళం, తెలుగు, హిందీ మరియు కన్నడ భాషలలో ఏకకాలంలో విడుదల కానుంది. నటుడు పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మురళి గోపి రచన చేశారు. దిల్ రాజు తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు.
వీర ధీర శూరన్ Vs లూసిఫర్ 2:
హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్గా వస్తోన్న వీర ధీర శూరన్.. తమిళం, తెలుగు మరియు మలయాళ భాషలలో బాక్సాఫీస్ రికార్డులకు సిద్ధమైంది. అయితే, ఈ సినిమాకు తెలుగులో చెప్పుకోదగ్గ బజ్ వినిపించడంలేదు. ఈ మూవీకి అదే రోజు (మార్చి 27న) పోటీగా వస్తోన్న మోహన్ లాల్ L2:ఎంపురాన్తో పోలిస్తే తక్కువనే చెప్పుకోవాలి.
ఎందుకంటే, లూసిఫర్ 2 సినిమా మేకర్స్ నెల రోజుల ముందు నుంచి వరుస ప్రమోషన్స్ చేస్తూ హైప్ ఇస్తూ వస్తున్నారు. వీర ధీర శూరన్ మేకర్స్ మాత్రం సినిమా రిలీజ్కు వారం ముందు ప్రమోషన్స్ మొదలు పెట్టారు. దాంతో లూసిఫర్ 2 సినిమాపై అంచనాలు పెరిగాయి. ఫస్ట్ డే దాదాపు రూ.70 నుంచి రూ.100కోట్ల మేరకు ఓపెనింగ్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్‌తో లూసిఫర్ 2 విడుదల కానుంది.
ఇక వీర ధీర సూరన్కు సరైన ప్రమోషన్లు లేకపోవడం, రిలీజ్ డేట్ లేట్ అవుతూ రావడం మైనస్గా నిలిచింది. దాంతో ఈ మూవీకి దాదాపు రూ.20 కోట్ల మేరకు ఓపెనింగ్ రావొచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.విక్రమ్ గత చిత్రం తంగలాన్ ఫస్ట్ డే రూ.17 కోట్లు వసూలు చేసింది.
ఈ చిత్రంలో దుషారా విజయన్, సిద్దిఖీ, ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడు తదితరులు నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ (U/A)సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలిసింది.
ఇక ఈ రెండు సినిమాలకు పోటీగా తెలుగు స్ట్రెయిట్ సినిమాలు కూడా రానున్నాయి. అందులో ఒకటి నితిన్ నటించిన రాబిన్ హుడ్ కాగా మరొకటి మ్యాడ్ స్క్వేర్. ఈ రెండు సినిమాలకు తెలుగు ఆడియన్స్ నుంచి మంచి హైప్ ఉంది.
ఇందులో ముఖ్యంగా సూపర్ హిట్ మ్యాడ్‍కు సీక్వెల్‍గా వస్తుండంతో మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి మంచి క్రేజ్ ఉంది. దీంతో బాక్సాఫీస్ వద్ద రాబిన్‍హుడ్, మ్యాడ్ స్క్వేర్ పోటీ ఆసక్తికరంగా మారింది.